మీకు సుజుకీ 125సీసీ స్కూటర్లు ఉన్నాయా..? అయితే ఈవిషయం తెలియాల్సిందే

మీలో ఎవరికైనా సుజుకీ స్కూటర్లు ఉన్నాయా.. మీ సుజుకీ స్కూటర్ లో స్టార్టింగ్ ట్రబుల్, ఇంజిన్ స్టేలింగ్, స్పీడ్ డిస్ ప్లే ఎర్రర్, స్టార్టింగ్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు వస్తున్నాయా.? .సుజుకీ స్కూటర్ల తయారీ సంస్థ సుజుకీ మోటార్స్ ఇండియా అటువంటి సమస్యలు ఉన్న స్కూటర్లను రీకాల్ చేసింది. ఈ సమస్యలు తలెత్తుతున్నాయని వీటిని వినియోగదారులు వెంటనే సమీప సర్వీస్ సెంటర్లలో చూపించి సమస్యలను  పరిష్కరించుకోవాలని సూచించింది. 

ALSO READ | ఓలా కారు ఇప్పట్లో లేనట్టే!

ఇంజిన్ ఆగిపోవడం, స్టార్టింగ్ ఫెయిల్యూర్, స్పీడ్ డిస్ ప్లే లోపం , ఇంజిన్ స్టార్ట్ కాకపోవడం వంటి సమస్యలున్న స్కూటర్లను రీకాల్ చేసినట్లు కంపెనీ తెలిపింది. Suzuki Motorcycle India, Access 125, Burgman Street 125 , Avenis 125తో సహా దాని 125cc స్కూటర్లలో మూడింటికి భారీ రీకాల్ జారీ చేసింది. 30 ఏప్రిల్ 2022 , 3 డిసెంబర్ 2022 మధ్య తయారు చేయబడిన మొత్తం 3లక్షల 88వేల 411 స్కూటర్లను రీకాల్ చేసింది. స్కూటర్ యజమానులు తమ వాహనాలను సమీపంలోని సర్వీస్ సెంటర్‌లో తనిఖీ చేసి, సమస్య ఉన్నట్లయితే దాన్ని పరిష్కరించుకోవడానికి సూచించింది.