సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచీ 2023–24లో తెలంగాణ స్థానం ఎంత?

నీతి ఆయోగ్​ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచీ 2023–24 నాలుగో ఎడిషన్​లో తెలంగాణ రాష్ట్రం 74 మార్కులతో 11వ స్థానంలో నిలిచింది. 2020–21లోనూ 69 మార్కులతో 11వ స్థానంలో నిలిచింది.  2017–18లో 9 (61 మార్కులు), 2019–20లో 5 (67 మార్కులు), 2020–21లో 11వ(69 మార్కులు) స్థానంలో ఉంది. 2023–24కుగాను 79 మార్కులతో ఉత్తరాఖండ్​ తొలి స్థానంలో నిలిచింది.

  •    తెలంగాణ లింగ సమానత్వంలో అత్యంత వెనుకబడి ఉంది. జీరో హంగర్​, నాణ్యమైన విద్య, వాతావరణ పరిరక్షణ, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్​, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ విభాగాల్లోనూ ఎల్లో జోన్​లో ఉంది. మిషన్​ భగీరథ ద్వారా ఇంటింటికీ నిరు అందిస్తున్నా ఆ విషయంలో 90 మార్కులతో 14 స్థానానికే పరిమితమైంది. నాణ్యమైన విద్యుత్తు అందించడంలో మాత్రం 100 శాతం మార్కులు సాధించింది. 
  •     సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన 1. పేదరికాన్ని నిర్మూలించడం 8. ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధిని సాధించడం, 13. వాతావరణ మార్పులపై చర్యలు 15. భూమిపై జీవజాతులను రక్షించడం తదితర లక్ష్యాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని పేర్కొంది. 
  •     ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల, స్వచ్ఛ భారత్​, జన్​ధన్​; ఆయుష్మాన్​ భారత్​ – పీఎంజేఏవై, ఆయుష్మాన్​ ఆరోగ్య మందిర్​, పీఎం ముద్ర యోజన, సౌభాగ్య, స్టార్ట్​ అప్ ఇండియా మొదలైన ప్రభుత్వ కార్యక్రమాలు వేగవంతమైన అభివృద్ధికి దోహదపడ్డాయి. 
  •     మొత్తం స్కోర్ లో అన్ని రాష్ట్రాలు మెరుగుపడ్డాయి. 
  •     2018లో 57 మార్కులతో ఉన్న భారత్​ 2019–20లో 60, 2020–21లో 66, 2023–24లో 71 మార్కులు సాధించి భారత్​ పనితీరును మెరుగుపరుచుకుంది. 
  •     సుస్థిరాభివృద్ధి 13వ లక్ష్యం (క్లైమేట్​ యాక్షన్​) 2020–21లో 54 నుంచి 2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌023–24లో 67కి అత్యధిక స్కోర్​ను సాధించింది. 1వ లక్ష్యం (పేదరిక నిర్మూలన) 60 నుంచి 72కి మెరుగుపడింది. 
  •     ఫ్రంట్​ రన్నర్ కేటగిరీలో 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 10 రాష్ట్రాలు కొత్తగా చేరాయి. అరుణాచల్​ప్రదేశ్​, అసోం, ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​, మణిపూర్​, ఒడిశా, రాజస్తాన్​, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్​, దాద్రా నగర్ హవేలీ, డామన్​ డయ్యూ.
  • ALSO READ : కనీస మద్దతు ధర అంటే ఏంటి.? వ్యవసాయ ధరల కమిషన్ విధులు