అనర్హులకు కల్యాణలక్ష్మి

  • ఆర్‌‌‌‌ఐ, ఇద్దరు పంచాయతీ సెక్రటరీలు సస్పెన్షన్‌

సూర్యాపేట, వెలుగు : అనర్హులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్‌‌‌‌ వేటు పడింది. సూర్యాపేట జిల్లా నూతనకల్‌‌‌‌ మండలం మాచినపల్లికి చెందిన పలువురు ఇటీవల కల్యాణలక్ష్మికి  అప్లై చేసుకున్నారు. వారిని స్కీమ్‌‌‌‌కు ఎంపిక చేస్తూ గత నెలలో చెక్కులు అందచేశారు. అయితే లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ గ్రామస్తులు ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్‌‌‌‌ ఆర్డీవో, తహసీల్దార్‌‌‌‌తో విచారణ జరిపించారు. 11 మంది అనర్హులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందినట్లు ఆఫీసర్లు గుర్తించారు.

పదేండ్ల కింద పెండ్లి చేసుకున్న వారు పంచాయతీ కార్యదర్శుల సాయంతో తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి ఇటీవలే పెండ్లి చేసుకున్నట్లు కల్యాణలక్ష్మికి అప్లై చేశారని, ఆర్‌‌‌‌ఐ ఎలాంటి విచారణ చేపట్టకుండానే వారికి చెక్కులు అందజేసినట్లు నిర్ధారించారు. దీంతో సెక్రటరీలు వెంకట్‌‌‌‌రెడ్డి, అనిల్‌‌‌‌తో పాటు ఆర్‌‌‌‌ఐ లక్ష్మీప్రసాద్‌‌‌‌ను సస్పెండ్‌‌‌‌ చేస్తూ కలెక్టర్‌‌‌‌ తేజల్‌‌‌‌ నందలాల్‌‌‌‌ పవార్‌‌‌‌ బుధవారం ఆర్డర్స్‌‌‌‌ జారీ చేశారు.