సూర్యాపేట జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహం ఎదుట నిరసన.. ఎందుకంటే

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం రామాపురం గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం   నెలకొంది.  రాత్రికి రాత్రే వెలిసిన ఆంజనేయస్వామి విగ్రహం.. ఆంజనేయ స్వామి విగ్రహం ముందు కొబ్బరికాయలు కొడుతూ  స్థానికులు  నిరసన తెలిపారు.   గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసంచేయగా.. ..ఈ మధ్యకాలంలో నందమూరి తారక రామారావు విగ్రహం ఎడమ చేతిని కొంతమంది   గుర్తుతెలియని దుండగులు విరగొట్టారు. ప్రస్తుతం ఓ వర్గం చేస్తున్న నిరసన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.