Surya45: 19 ఏళ్ల తర్వాత సూర్యతో జతకట్టనున్న త్రిష.. డైరెక్టర్ ఎవరంటే?

కోలీవుడ్ స్టార్ సూర్య (Surya) హీరోగా మరో కొత్త సినిమాను ఇటీవలే ప్రకటించాడు. తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 45వ చిత్రం. నయనతారతో ‘అమ్మోరు తల్లి’ చిత్రం తెరకెక్కించిన నటుడు ఆర్జే బాలాజీ (RJ Balaji).. ఈ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ ప్రకాష్‌‌‌‌‌‌‌‌బాబు, ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ ప్రభు నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో సూర్యకి జోడిగా స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) నటిస్తుందట. ఇప్పటికే డైరెక్టర్ త్రిషకు స్టోరీ చెప్పగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేందని తెలుస్తోంది.

ALSO READ | కొత్త కంటెంట్, డివైన్ థీమ్‌‌తో... దేవకి నందన వాసుదేవ మూవీ : అశోక్ గల్లా

అయితే.. సూర్య, త్రిష ఇద్దరు కలిసి 2005లో చేసిన ఆరు సినిమా తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపించలేదు. అంటే 19 ఏళ్ల తర్వాత ఈ జంట స్క్రీన్ పై మెరువబోతుందన్నమాట. తమ కెరీర్ లో మౌనం పేసియాదే, ఆయుత ఏడు, ఆరు సినిమాల తర్వాత తెరపై మళ్ళీ కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ కి పండుగనే చెప్పుకోవాలి. ప్రస్తుతం త్రిష వరుస సినిమాల్లో నటిస్తోంది.

ఓ వైపు యంగ్ హీరోలతో పాటు..సీనియర్ హీరోలతోను యాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం త్రిష చేతిలో అరడజనుకి పైగా మూవీస్ ఉన్నట్లు తెలుస్తోంది. చిరు సరసన విశ్వంభర, అజిత్ విదా మూయుర్చి, కమల్ హాసన్ థగ్ లైఫ్,మోహన్ లాల్ రామ్ వంటి మరిన్ని సినిమాల్లో నటిస్తుంది.