డబ్బులు బాగానే ఉన్నాయి : లక్ష రూపాయల ఖరీదైన ఫోన్ సేల్స్ భారీగా పెరిగాయి..

సెల్ ఫోన్..ఇది ప్రతి మనిషీ దైనందిన జీవితంలో ఓ పార్ట్ అయింది.  అన్నం లేకుండా అయినా ఉంటారేమోగానీ. సెల్ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి నెలకొం ది.. అంతలా ఎడిక్ట్ అయ్యారు వినియోగదారులు . బిజినెస్ మ్యాన్ లు  నుంచి..బిచ్చగాడి వరకు ఎవరి చేతుల చూసినా అవే.. అయితే స్మార్ట్ ఫోన్ల వాడకంపై.. అందులో ఖరీదైన స్మార్ట్ ఫోన్లు వినియోగంపై తాజా రిపోర్ట్స్ సంచలన విషయాలు వెల్లడించాయి.  

మన దేశంలో లక్ష రూపాయలు, అంతకంటే ఎక్కువ ఖరీదైన స్మార్ట్ ఫోన్లు అమ్మకాలు బాగా పెరిగాయని నివేదికలు చెపుతున్నాయి. ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్ లో దాదాపు రూ. లక్ష, అంతకంటే ఎక్కువ ధర ఉన్న స్మార్ట్ ఫోన్లు 20 శాతం పెరిగాయట.  

ప్రజలకు  ప్రీమియం ఉత్పత్తులపై పెరుగుతున్న మోజు ఇందుకు కారణం అని చెపుతున్నాయి. ఎటువంటి ఆదాయం లేనప్పటికీ ఇంత పెద్ద మొత్తం పెట్టి స్మార్ట్ ఫోన్లను కొనడానికి ప్రజలు మొగ్గుచూపడం.. ప్రీమియం ప్రాడక్టుల  వైపు పెరుగుతున్న ఆకర్షణే కారణమంటున్నారు నిపుణులు. 

శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్స్ , కొత్త యాపిల్ ఐఫోన్ సిరీస్ రాకతో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో కూడా ప్రీమియం స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

2021లో లగ్జరీ, లేదా సూపర్ ప్రీమియం స్మార్ట్ ఫోన్లు 14 శాతం పెరగ్గా.. 2022లో ఈ వృద్ధి 96 శాతానికి పెరిగింది.. ఇక 2023లో 53 శాతానికి పెరిగింది. ఇందులో 52 శాతం వాటాతో శాంసంగ్ సూపర్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ అమ్మకాలు చేసింది. 

పిల్ 46శాతంతో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ప్రీమియమైజేషన్ వేవ్ ఊపందుకుందని సైబర్ మీడియా రీసెర్చ్ (CMR) VP  ఇండస్ట్రీ రీసెర్చ్ గ్రూప్ ప్రతినిధులు చెబుతున్నారు.