సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం: మోత్కుపల్లి

ఖైరతాబాద్, వెలుగు: మాదిగల ఎ,బీ,సీ,డీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. గురువారం ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశం, రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు దానిని అమలు చేయలేదని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా వర్గీకరణను అమలు చేయాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బతికుండాలంటే కోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు.