బిల్కిస్ బానో కేసులో.. గుజరాత్ ప్రభుత్వ పిటిషన్ రద్దు చేసిన సుప్రీం కోర్టు

దేశవ్యాప్తంగా సంచలనం సృస్టించిన బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 2002లో బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ కేసులో నేరస్తులుగా తేలిన 11 మందికి గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. అయితే సుప్రీం  కోర్టు ఆ క్షమాభిక్షను రద్దు చేసింది. క్షమాభిక్ష రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతూ గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‪ను సుప్రీం కోర్టు విచారించకుండానే గురువారం తిరస్కరించింది. న్యాయమూర్తులు బివి నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం బహిరంగ అప్పీల్‌లో ఎలాంటి లోపం లేదా మెరిట్ లేదని పేర్కొంటూ ఓపెన్ అప్పీల్‌ను కొట్టివేసింది.

రివ్యూ పిటీషన్, సుప్రీం కోర్టు నిర్ణయం ఛాలెంజ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పేపర్‌లను జాగ్రత్తగా ధర్మాసనం పరిశీలించింది. రివ్యూ పిటిషన్‌లో ఎలాంటి తప్పు కనిపించలేదని లేదా రివ్యూ పిటిషన్‌లో ఎలాంటి మెరిట్ లేదని మేము సంతృప్తి చెందామని పేర్కొంటూ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. 

ALSO READ : తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టు బెయిల్

2002లో గుజరాత్ లో గోద్రా రైలు దహనం హింసాకాండలో ఐదు నెలల గర్భిణి అత్యాచారానికి గురైంది. ఆగస్టు 15న 11 మంది ఆమె కుటుంబంలో ఏడుగురిని అత్యాచారం చేసి హత్య చేశారు. నేరం రుజువైయ్యాక గుజరాత్ శిక్ష అనుభవిస్తున్న వారికి గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి నేరారోపణలను సస్పెండ్ చేసింది. దీనిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్షమాభిక్ష రద్దు చేసింది.  జనవరి 8న సుప్రీంకోర్టు దోషులను రెండు వారాల్లోగా తక్షణమే రిమాండ్ చేయాలని ఆదేశించింది. గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ఉత్తర్వు చట్టవిరుద్ధమని ప్రకటించింది.