బాదం లాంటి ఇతర డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి పోషకాలతో పాటు శక్తిని అందిస్తాయి. మీరు ఇప్పటివరకు చాలా రకాల డ్రై ఫ్రూట్స్ పేర్లు వినే ఉంటారు. అయితే ఈ రోజు మనం మీకు టైగర్ నట్స్ గురించి తెలుసుకుందాం. టైగర్ నట్ అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇంతకీ టైగర్ నట్ అంటే ఏమిటి, దాని ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టైగర్ నట్‌ను ఎర్త్ బాదం, చుఫా గింజలు లేదా ఎర్త్ నట్ అని కూడా అంటారు. ఇది బాదంపప్పులాగా, కొబ్బరికాయ లాంటి రుచిని కలిగి ఉంటుంది. ఇందులో కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్ వంటి పోషకాలుంటాయి. దీంతో పాటు, ఇందులో విటమిన్ సి, డి, ఇ ఉండడం వల్ల శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి.
టైగర్ నట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు..
1. గుండెకు మంచిది: టైగర్ నట్స్ మిమ్మల్ని గుండె సంబంధిత వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. ఇది కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే మినరల్స్, ఫైబర్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో పాటు గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది.
2. మలబద్ధకం ఉండదు: టైగర్ నట్స్ మీ జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో పాటు, టైగర్ నట్స్ ను తీసుకోవడం ద్వారా మీకు పదే పదే ఆకలి వేయదు, ఇది కొవ్వును కూడా తగ్గిస్తుంది.
3. బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది: టైగర్ నట్స్ లో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. అంటే, ఫైబర్ సహాయంతో, మీ శరీరంలోని చక్కెరను సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని తీసుకోవచ్చు.
4. ఎముకలు దృఢంగా మారతాయి: టైగర్ నట్స్ లో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఇది మీ ఎముకలను బలోపేతం చేయడానికి సహకరిస్తుంది. దీంతో పాటు, ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఇందులో విటమిన్ డి కూడా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని అలాగే మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.