Beetroot: సూపర్ ఫుడ్ బీట్ రూట్ తో.. ఆరోగ్యానికి ఐదు లాభాలు

బీట్ రూట్.. అనేక పోషకాలున్న వెజిటబుల్.. కలర్ ఫుల్ గా ఉండే ఈ వెజిటబుల్ ను సూపర్ ఫుడ్ గా చెబుతుంటారు. ఆరోగ్యాన్ని అందించే కూరగాయాల్లో ఒకటి. అనేక పోషకాలుంటాయి. అటువంటి బీట్ రూట్ మన రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే కలిగే లాభాల గురించి మీకోసం.. 

బీట్ రూట్ తో కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు.. 

తక్కువ కాలరీలతో.. ఎక్కువ విటమిన్లతో.. 

బీట్ రూట్లతో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తక్కువ కాలరీతో ఎక్కువ విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఫోలేట్, మాంగనీస్, కాపర్ వంటి ఖనిజాలను ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మనం ఆరోగ్యం ఉండటంలో సహాయపడతాయి. 

కంట్రోల్ బ్లడ్ షుగర్.. 

బీట్ రూట్ లు బ్లడ్ షుగర్ ను కంట్రోల చేస్తాయి. వీటిలో ఫోలేట్ తక్కువ రక్తపోటు లెవెల్స్ మెయింటెన్ చేసేలా చేస్తాయి. 

జీర్ణశక్తి పెరుగుటలో.. 

బీట్ రూట్ లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి రోజు మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా జీర్ణాశయం, పేగుల్లో బ్యాక్టీరియా వృద్ధిచెంది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. అజీర్ణం సమస్యలను తగ్గిస్తుంది. దీర్ణకాలిక వ్యాధులను నయం చేస్తుంది. 

మెదడుకు ఆరోగ్యం.. 

బీట్ రూట్ తింటే మెదడు కు ఆరోగ్యం.. ఇది మెదడుకు రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. డైమెన్షియా వంటి న్యూరాలాజికల్ డిజార్డర్లను తగ్గిస్తుంది. 

క్రీడాకారులకు ఎంతో మేలు.. 

బీట్ రూట్లు మైటోకాండ్రియా పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో అథ్లెట్లలో ఆక్సిజన్ వినియోగాన్ని  పెంచుతుంది. ఇందులో నైట్రేట్లు దీనికి సహకరిస్తాయి. 
కాబట్టి రోజువారీ ఆహారంలో బీట్ రూట్లను చేర్చుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు డైటీషియన్లు. 

ALSO READ | అంబానీ లడ్డూనా.. ఇదేందయ్యా ఇది.. కొత్తగా వచ్చిందే.. ఎలా తయారు చేస్తారంటే..!