US Presidential Elections: అంతరిక్షం నుండే నుంచే సునీత ఓటు

వాషింగ్టన్: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో ఉన్న ఆస్ట్రోనాట్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. భూమి నుంచి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రోనాట్లు కూడా ఓటు వేసేందుకు అర్హులు. ప్రస్తుతం ఐఎస్ఎస్‎లో ఇద్దరు ఆస్ట్రోనాట్లు బ్యారీ బుచ్ విల్‌‌‌‌మోర్, సునీత విలియమ్స్ ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసేందుకు వీళ్లిద్దరూ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో నాసాకు చెందిన మిషన్ కంట్రోల్ వీరికి రహస్యంగా ఈ–మెయిల్ ద్వారా బ్యాలెట్ పత్రాలను పంపిస్తుంది. వాళ్లు దాన్ని పూర్తి చేసి మిషన్ కంట్రోల్ సెంటర్‌‌‌‌కు తిరిగి పంపిస్తారు. నాసా వాటిని సంబంధిత కౌంటీ క్లర్క్‌‌‌‌కు పంపిస్తుంది.