Sunita Williams:అంతరిక్షంలో సునీత విలియమ్స్ నిజంగా ప్రమాదంలో ఉన్నారా? ఆమె మాటల్లో..

నిజంగా సునీత విలియమ్స్ ప్రమాదంలో ఉన్నారా..? అంతరిక్షంలో వ్యోమగామి సునీత విలియమ్స్ ప్రమాదంలో ఉన్నారు..ఆమె చాలా బరువు తగ్గి సన్నగా కనిపించారు..ఇది ఆమె ప్రమాదంలో ఉంది అనడానికి సూచిక.. నాసా ఆమె ఆరోగ్యంపై స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదా..సునితా విలియమ్స్ పరిస్థితి ఇలా ఉంటే ఆమె అంతరిక్షం నుంచి భూమ్మీదకు ఎప్పుడు ఎలా తిరిగొస్తారు.. ఇవి సోషల్ మీడియాలో సునీత విలియమ్స్ ఫొటోలు చూసిన అందరికి కలిగిన సందేహాలు. నిజంగా సునీత విలియమ్స్ ఆరోగ్యంగా ఉన్నారా.?గత కొద్ది నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో  ఉన్న ఆమె  ఎందుకు బరువు తగ్గారు.. అయితే తాజాగా సునీత విలియమ్స్ నుంచి వచ్చిన  మేసేజ్ ఏం చెబుతుందంటే.. 

అంతరిక్ష ప్రయాణంలో సునీతా విలియమ్స్ చాలా అనుభవజ్ణురాలు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో  నాసాకు చెందిన స్టార్ లైనర్ ప్రోగ్రామ్ లో మెంబర్ గా ఉన్నారు. అయితే ఇటీవల ఆమె ఫిటినెస్ అప్డేట్స పై అనేక అనుమానాలు వచ్చాయి. ప్రత్యేకించి ఇటీవల వెలుగులోకి వచ్చిన ఆమె ఫొటోల్లో ఆమె చాలా లీన్ కనిపించడం ఆందోళనకు దారితీసింది. ఆమె శరీరంలో వచ్చిన మార్పులపై సునితా విలియమ్స్ మేసేజ్ ఇప్పుడు హైలైట్ గా నిలిచింది. 

Also Read : మణిపూర్లో మళ్లీ హింస

అంతరిక్షంలో ఆస్ట్రోనాట్స్ ఎందుకు భిన్నంగా కనిపిస్తారంటే.. 

అంతరిక్షంలో ఆస్ట్రోనాట్స్ అనుభవించే స్పష్టమైన మార్పుల్లో శరీద్రవాల పంపిణీ ముఖ్యమైనంది. సాధారణంగా భూమిపై ఉంటే మనుషులకు గురుత్వాకర్షణ శక్తి వల్ల శరీరంలో ద్రవాలు కిందివైపు లాగబడతాయి. అయితే అంతరిక్షంలో మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది.. ఆస్ట్రోనాట్స్ లలో శరీర ద్రవాలు పైకి లాగబడతాయి.. అంటే తలం, ఎగువ శరీరం వైపు ఫ్లూయిడ్స్ వెళతాయి. ఫలితంగా వ్యోమగాములు ఉబ్బినట్లుగా , వారి తలలు డిఫరెంట్ గా కనిపిస్తాయి. అయితే సునీత విలియమ్స్ బుగ్గలు పీక్కు పోయి ఉండటం కొంత ఆందోళకర విషయమే అయినప్పటికీ అవి మైక్రోగ్రావిటీ వల్ల కలిగి సాధారణ మార్పులేనట.. అంతరిక్షంలో మనిషి అస్థిపంజర వ్యవస్థ, కండరాలు భూమిపై కంటే భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఆమె శరీర భంగిమ , కండరాల స్థాయి వంటి ఇతర మార్పులు కూడా వచ్చాయట.  

బరువు తగ్గడంపై సునీతి విలియమ్స్ ఆమె  మాటల్లోనే.. 

సునీతా విలియమ్స్ ఆరోగ్యానికి సంబంధించి.. ఆమె సన్నగా ఉన్నట్లు కనిపించే ఫొటోలపై ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్న క్రమంలో ఆమె స్పందిస్తూ.. ‘‘ నేను ISS కి వచ్చినప్పుడు ఎంత  బరువు ఉన్నానో ..ఇప్పుడు అంతే బరువున్నాను.  ఆరోగ్యంగా ఉన్నారడగానికి సూచిక బరువు.. స్పెషలిస్టు ఎక్విప్ మెంట్ ఉపయోగించి NASA వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నారని పరీక్షంలో తేలింది. అయితే నేను బరువు తగ్గడం అనేది కేవలం ఫ్లూయిడ్ షిఫ్ట్, కండరాల్లో మార్పుల వల్ల వచ్చి ఆప్టికల్ భ్రమ’’ అని ఆమె చెప్పారు.