గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కంపెనీ నిర్వహణలోని కొన్ని రహస్యాలను బయటపెట్టారు. గూగుల్ తన ఉద్యోగులకోసం ఉచిత భోజన పాలసీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే..అయితే ఈ పాలసీలో అధిక మొత్తం ఖర్చుచేసి ఎందుకు నిర్వహిస్తోందో వెల్లడించారు. ఈ భోజనాలు కేవలం ప్రోత్సాహకాలు మాత్రమే కాదని.. అవి లోతైన ప్రయోజనాన్ని అందించాయని అన్నారు.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్యూలో సుందర్ పిచాయ్ గూగుల్ సంస్థ సక్సెస్ ఫుల్ నిర్వహణకు సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు. తాను మొదట్లో గూగుల్ లో చేరిన రోజుల్లో కేఫ్ లలో ఉద్యోగులు ఒకరితో ఒకర కలుసుకున్నప్పుడు పంచుకున్న విషయాలకు సంబంధించిన గుర్తు చేసుకున్నారు.
2004లో గూగుల్ లో ప్రాడక్ట్ మేనేజర్ గా ఉన్న రోజుల్లో సుందర్ పిచాయ్ కలిసి భోజనం చేసే సమయంయలో అద్భుతమైన ఆలోచనలు వెలువడతాయని గుర్తించా నన్నారు. ఉద్యోగులు తినే సమయంలో వారు సహకరించుకుంటూ , వచ్చే ఆలోచనలు కొత్త ఆవిష్కరణలకు బాటలు వేస్తాయని అన్నారు. దీనిని నుంచి వ చ్చే ప్రయోజనం ముందు భోజనం కోసం చేసే ఖర్చు చాలా తక్కువన్నారు.
ఉచిత భోజనం ఆర్థిక భారం కాదని.. సృజనాత్మకత, సమాజ నిర్మాణానికి దీర్ఘకాలిక పెట్టుబడి సుందర్ పిచాయ్ చెప్పారు. ఉద్యోగి స్నేహపూర్వక కార్యక్రమాఅలు కంపెనీ డైనమిక్ లను ప్రభావితం చేస్తాయన్నారు.