Astrology: జులై 16న .. కర్కాటక రాశిలోకి సూర్యుడు..4 రాశుల వారికి కనక వర్షం...

గ్రహాల రాజైన సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యదేవుడు ప్రస్తుతం మిథునరాశిలో ఉన్నాడు.  జూలై  16సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో ఇప్పటికే ఆ రాశిలో ఉన్న బుధుడితో కలసి బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.   ఆగస్టు 16 వరకు  ఇదే రాశిలో కొనసాగుతాడు. కర్కాటక రాశిలో సూర్యోదయం నాలుగు రాశుల వారికి  కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తెస్తుంది. అయితే ఈ సంచారం కారణంగా ఎక్కువగా లాభాలు పొందబోయే రాశులవారితో పాటు మిగతా రాశుల వారికి ఎలా ఉందో  తెలుసుకుందాం...

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అన్ని గ్రహాలకు రాజులు, రాకుమారులు ఉంటారు. సూర్య గ్రహాన్ని అన్ని గ్రహాలకు రాజుగా భావిస్తారు. అయితే ఈ గ్రహం ఏ రాశిలోనే 30 రోజు ఉంటుంది. ఆ తర్వాత ఇతర రాశిలోకి సంచారం చేస్తుంది. మరికొద్ది రోజుల్లో  సూర్యుడు కొత్త రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహ సంచారం కారణంగా శుభ, అశుభ ప్రభావాలు పడుతాయని జ్యోతిష్యులు తెలుపుతన్నారు. అయితే ఈ గ్రహం జూలై 16న కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతోంది. ఇది ఆగస్టు 15 వరకు అదే రాశిలో కొనసాగుతూ ఉంటుంది.  కర్కాటక రాశిలో సూర్య భగవానుడు ఒక నెలపాటు సంచరించడం వల్ల కూడా బుధుడు మరియు శుక్రుడు కలయిక ఏర్పడుతుంది.  దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆగస్టు 15 వరకు  మిథున రాశి, కన్యారాశి, తులారాశి, మీనరాశి (నాలుగు) రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

మేష రాశి :  సూర్యుడు కర్కాటక రాశిలో బుధ గ్రహం కలవడం వలన మేషరాశి వారు  విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న ఫలితాలను సాధిస్తారు.  అయితే ఉద్యోగస్తులు పనిభారం పెరుగుతుంది.  ఆర్థిక పరంగా పెట్టుపబడులు పెట్టేందుకు మంచి సమయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  పెళ్లికాని యువకులు తమ వివాహ ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైవాహిక జీవితం అస్తవ్యస్తం కావచ్చు. గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి. వారి మందులు, ఆహారం మరియు దినచర్యను నియంత్రించాలి.

వృషభ రాశి: ఈ రాశిలో సూర్యుడు మూడో ఇంట్లో ఉంటాడు. సూర్యుడి దిశ మారడం వల్ల ఈ రాశివారికి ప్రయోజనం చేకూరనుంది. వాహనయోగం ఉంది. దాని వల్ల ఇంట్లో ఆనందం పెరిగే అవకాశం ఉంది. ఈ రాశివారికి కుటుంబంలో, సమాజంలో గౌరవం మరింత పెరిగే అవకాశం ఉంది.  కష్టపడి పనిచేస్తే ఇప్పుడు ప్రమోషన్ రూపంలో ఫలితాలు వస్తాయి. విదేశాలకు వెళ్లవలసి రావచ్చు. లాభాలను ఆర్జించడానికి, వ్యాపార తరగతి సాంకేతికత సహాయం తీసుకోవాలి. ప్రభుత్వ పథకాలు, క్రీడలకు సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆస్తి వివాదాలు తలెత్తవచ్చు. తోబుట్టువులు పురోభివృద్ధి చెందుతారు. వాహన ప్రమాదాలు మరియు వృద్ధులకు సమస్యలు పెరుగుతాయి. కాబట్టి అజాగ్రత్తను నివారించండి. ఎసిడిటీ సమస్య పెరుగుతుంది.  ఆదిత్య హృదయం ప్రతిరోజు పఠిస్తే ఉపశమనం పొందుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  

మిథున రాశి: ఈ రాశివారికి సూర్యుడు రెండో ఇంట్లో ఉంటాడు. దీని వల్ల ఈ రాశివారికి ఉన్న సమస్యలన్నీ పరిష్కారమౌతాయి. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అధికారిక పనులకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా శ్రద్ధ వహించాలి . ప్రభుత్వ బ్యాంకుల్లో పని చేసే వారికి ప్రమోషన్‌కు సంబంధించిన శుభవార్త అందుతుంది. వ్యాపార తరగతికి చెందిన ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. భవిష్యత్తు ప్రణాళికతో పాటు కొన్ని పెట్టుబడులు పెట్టాలనుకుంటే, ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.  ఎవరితోనూ వాదన పెట్టుకోకండి. అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్య పరంగా కళ్లలో దురదలు, నీరు కారడం లేదా మంట వంటి సమస్యలు రావచ్చు.


కర్కాటక రాశి: ఈ రాశి వారికి సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వలన ఆఫీసు పనులు చేయడంలో ప్రాధాన్యత చూపాలి. లేకుంటే ముఖ్యమైన పనులు తప్పిపోతాయి మరియు పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. యజమానితో మంచి అనుబంధాన్ని కొనసాగించండి.  పూర్వీకుల వ్యాపారంలో ఉన్నట్లయితే సీనియర్ వ్యక్తుల నుండి మార్గదర్శకత్వంతో పని చేస్తే మంచి లాభాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ వివాదాలకు దారితీయకండి. వీలైనంత వరకు వాటిని నివారించడానికి ప్రయత్నించండి.

సింహ రాశి:  ఈ రాశి వారికి సూర్యడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వలన  సహోద్యోగులతో సమన్వయం పాటిస్తారు. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసే వారికి మంచి ప్రతిపాదన రావచ్చు. సింహరాశి వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెట్టుబడులకు సంబంధించి గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. దీనివల్ల ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. లేదంటే దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడతారు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. విద్యార్థులకు మంచి లాభాలు కలుగుతాయి. చదువుపై ఏకాగ్రత కుదురుతుంది. పని ఒత్తిడి తగ్గుతుంది.

కన్యా రాశి:   కర్కాటక రాశిలో శుక్రుడు, సూర్యుని సంచారం వలన  కన్య రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ వ్యక్తులు వారి ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. . అప్పుల బాధ తీరుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. షేర్ మార్కెట్ నుండి కూడా లాభాలు పొందవచ్చు. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగస్తులకు అనుకోకుండా ప్రమోషన్​ లభిస్తుంది.  అయితే స్థాన చలనం కలుగుతుంది. 

తులా రాశి:  కర్కాటక రాశిలో బుధుడు , సూర్యుని కలయిక మీకు గొప్ప ప్రయోజనాలను తెస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కెరీర్‌కు సంబంధించిన శుభవార్తలను అందుకోవచ్చు. కొత్త ఉద్యోగం పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు మీ కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. మీ దృష్టి పనిపై ఉంటుంది, ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. సీనియర్లు మరియు జూనియర్లు అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది

వృశ్చికరాశి: ఈ రాశి వారికి కర్కాటకంలో .. సూర్యుడు.. శుక్రుడు కలయిక వలన వృశ్చికరాశి వీరికి అంతా శుభప్రదంగా ఉంటుంది. కెరీర్ కు సంబంధించి మార్పులు చోటుచేసుకుంటాయి. ఎలాంటి పనులు తలపెట్టినా విజయం సాధిస్తారు.  ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చిన్న చిన్న ప్రయాణాలుంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి..అలాగే ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు వ్యాపారాలు చేయాలనుకునేవారు మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అలాగే వీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సంచార సమయంలో చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేయవచ్చు. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. 

ధనస్సు రాశి:  ఈరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. వీరు ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. విద్య, ఉద్యోగ , వ్యాపారాల్లో కష్ట పడాల్సి ఉంటుంది. కొన్ని సమయాల్లో ఇష్టం లేని పని కూడా చేయాల్సి రావచ్చు.  జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి.  వాహనాలు డ్రైవింగ్​ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి.. కొత్త ఉద్యోగంలో చేరే విషయం వాయిదా వేసుకోండి.  కొన్నిసార్లు మీకు సంబంధం లేకుండా మీరు మాట పడాల్సి వస్తుంది.  అన్నిటికి కాలమే పరిష్కారం చూపుతుందని.. ఎవరితోనూ ఎక్కువుగా మాట్లాడవద్దు.. వాదన పెట్టుకోవద్దు.  నిత్యం హనుమాన్​ చాలీసాతోపొటు... సుందరాకాండ పారాయణ చేయండి. 

మకర రాశి.. కర్కాటక రాశిలోకి సూర్య గ్రహ సంచారం వలన   అన్ని మంచి ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. పెద్ద ప్రణాళికల్లో విజయం సాధిస్తారు. పని విస్తరిస్తుంది. అధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. అయితే ఒక్కోసారి మీరు అనుకోకుండా మాట పడాల్సి వస్తుంది.  మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు  చాలా జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడండి.  ఎదుటి వ్యక్తులతో అసలు వాదన పెట్టు కోవద్దు. సమయస్ఫూర్తితో ఉండాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.  ప్రతి రోజు విష్ణుసహస్రనామం పఠిస్తే ఉపశమనం పొందుతారని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. 

కుంభరాశి..కర్కాటక రాశిలో లో సూర్యుడు సంచరించడం వల్ల కుంభ రాశి వారి శత్రువులు ఓడిపోతారు కొన్ని విషయాలు ఆందోళనలు కలిగిస్తాయి. ఆర్థిక విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి.  కానీ.. కుటుంబంలో అంతా మంచే జరుగుతుంది. బాధ్యతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇతరుల పట్ల మరింత వివక్షగా ఉండాలి. ద్యార్థులు ఈ కాలంలో విజయం సాధిస్తారు. ఉద్యోగ వృత్తి జాతకం ఈ కాలంలో ప్రమోషన్ పొందవచ్చు. ఆరోగ్య విషయంలో  తలనొప్పి, కళ్లలో చికాకులు ఎదురవుతాయని చెబుతున్నారు. ప్రతిరోజు ఆదిత్య  హృదయం, సూర్యాష్టకం పఠించండి. 

మీనరాశి :కర్కాటక రాశిలో సూర్యుడి సంచారం ప్రభావం వల్ల  మీన రాశి వారు మీ సమస్యల పరిష్కారానికి భిన్నంగా ఆలోచిస్తారు. అయితే మీన రాశివారికి కూడా ఈ సంచారం ఎంతో లాభాదయకంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు వ్యాపారాల్లో లాభాలు పొందడమే కాకుండా ఆర్థికంగా మెరుగుపడే ఛాన్స్‌ కూడా ఉంది. ఇక విద్యార్థులైతే ఈ సమయంలో విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఖర్చులు కూడా పెరిగే ఛాన్స్‌ ఉంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపులున్నారు. దీంతో పాటు ఒత్తిడి పెరిగి అనారోగ్య సమస్యలకు దారీ తీసే అవకాశాలు‌ కూడా ఉంది. అలాగే ఈ సమయంలో స్నేహితుల నుంచి సలహాలు తీసుకోవడం చాలా మంచిది. మీ ప్రతిభను ఉన్నతాధికారులు కూడా గుర్తిస్తారు. ఈ సమయంలో మీ పిల్లలతో గడపడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది.