వేసవిలో బాగా దొరికే పచ్చి మామిడి, మామిడి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వాటిలో విటమిన్-ఎ, బి, సి, కె... ఎక్కువగా ఉంటాయి. బాగా పండిన మామిడి పండ్లలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. అయితే ప్రతిసారీ కేవలం మామిడిపండ్లను మాత్రమే తింటే బోర్ కొడుతుంది. అందుకే వాటితో రోజుకో వెరైటీ చేసుకుని తింటే, ఆ మజానే వేరు కదా! ఆ వెరైటీలన్నీ మీ కోసమే. వెంటనే ట్రై చేసి... లాగించండి.
మ్యాంగో లడ్డూ
కావాల్సినవి
- మామిడిపండ్లు రెండు
- చక్కెర పొడి - అర కప్పు
- ఎండుకొబ్బరి తురుము - అర కప్పు (కావా లనుకుంటేనే)
- ఇలాచీ పొడి - అరటీస్పూన్
- నెయ్యి - అర కప్పు
- శనగపిండి - ఒక కప్పు
- వేగించిన జీడిపప్పు తరుగు - ఒక టేబుల్ స్పూన్
- వేగించిన కిస్మిస్ - ఒక టేబుల్ స్పూన్
తయారీ
మామిడిపండును ముక్కలు చేసి మిక్సీలో, వేసి గ్రైండ్ చేయాలి. ఆ రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, శెనగపిండి వేసి దోరగా వేగించాలి. తర్వాత వెడల్పాటి ప్లేట్లో వేగించిన శెనగ పిండి, చక్కెర పొడి, ఇలాచీ పొడి, జీడిపప్పు, కిస్ మిస్ తరుగు వేసి బాగా కలపాలి. అందులో మామిడిపండు రసాన్ని వేసి మెత్తగా కలపాలి. తర్వాత చేతికి కాస్తంత నెయ్యి రాసుకుంటూ, ఆ మిశ్రమాన్ని లడ్డూ ల్లా చేయాలి. వీటిని కొబ్బరి తురుములో దొర్లించి ఆరబెట్టాలి. ఎంతో రుచికరమైన మ్యాంగో లడ్డూ రెడీ.
మ్యాంగో కేక్
కావాల్సినవి
- గోధుమ పిండి - ఒకటిన్నర కప్పు
- బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్
- బేకింగ్ సోడా - అర టీ స్పూన్
- మామిడి పండ్లు- రెండు
- చక్కెర- నాలుగు టేబుల్ స్పూన్లు
- వెన్న - అర కప్పు
- చిక్కటి పాలు- ముప్పావు కప్పు
- వెనిల్లా ఎసెన్స్ - ఒక టీ స్పూన్
- ఇలాచీ పొడి - అర టీ స్పూన్
తయారీ
ఒక గిన్నెలో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి కలిపి పక్కన పెట్టాలి. మామిడి పండ్ల తొక్క తీసి ముక్కలు చేయాలి. వాటిని చక్కెరతో కలిపి మిక్సీలో గ్రైండ్ చేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, వెన్న వేయాలి. అది వేడెక్కాక చిక్కటి పాలు పోసి మరిగించాలి. అది పూర్తిగా క్రీమ్ అయ్యాక, మామిడిపండు గుజ్జు, ఇలాచీ పొడి, వెనిల్లా ఎసెన్స్ వేయాలి. తర్వాత గోధుమ పిండి మిశ్రమం వేసి బాగా కలపాలి. పిండి గట్టిగా అనిపిస్తే కొన్ని పాలు పోసి కలపొచ్చు. పిండిని ఎంత బాగా కలిపితే... కే. అంత మృదువుగా వస్తుంది. నూనె లేదా నెయ్యి రాసిన ఒవెన్ గిన్నెలో పిండిని వేయాలి. ఒవెసిని 180 డిగ్రీల సెల్సియస్లో సెట్ చేసి 40 నుంచి 50 నిమిషాల వరకు కేతు బేక్ చేయాలి. అంతే, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే మ్యాంగో కేక్ రెడీ అయినట్లే.
మ్యాంగో ఖీర్
కావాల్సినవి
- పాలు - రెండు కప్పులు
- బియ్యం- రెండు టేబుల్ స్పూన్లు
- చక్కెర లేదా బెల్లం తురుము- అర టేబుల్ స్పూన్
- మామిడిపండు- రెండు
- ఇలాచీ పొడి - ఒక టీ స్పూన్
- బాదం పప్పు తరుగు - అర టీ స్పూన్
- కుంకుమపువ్వు - చిటికెడు
- మామిడిపండు గుజ్జు- రెండు టేబుల్ స్పూన్లు
- వేగించిన జీడిపప్పు పలుకులు -అరటీ స్పూన్
తయారీ
పాలు, బియ్యం, చక్కెర లేదా బెల్లం తురుము కలిపి మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత గంటసేపు ఫ్రిజ్ ఉంచాలి. ఇప్పుడు మామిడిపండ్ల తొక్క తీసి తురమాలి. ఫ్రిజ్ లో పెట్టిన రైస్ లీరిని బయటకు తీసి, అందులో మామిడిపండు గుజ్జు, మామిడిపండు తురుము, కుంకుమ పువ్వు, ఇలాచీ పొడి వేసి కలపాలి. పైన జీడి పప్పు, బాదంపప్పు తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. తియ్యగా, రుచిగా ఉండే ఈ ఖీరు పిల్లలు ఇష్టంగా తింటారు.