సమ్మర్ స్పెషల్ ప్రూట్.. తాటిముంజలు.. ఇవి ఎన్ని లాభాలో...

ఎండాకాలంలో మాత్రమే దొరికే స్పెషల్ ఫ్రూట్స్ తాటిముంజలు. వీటిని ఐస్ ఆపిల్స్ అని కూడా అంటారు. తెలంగాణ, ఏపీ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా పల్లెటూర్లలో దొరికే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. గత కొంత కాలంగా పట్టణాల్లో కూడా ఈ తాటిముంజలను విక్రయిస్తున్నారు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ పండ్లను ప్రజలు చాలా ఇష్టంగా తింటుంటారు. 

తాటిముంజల్లో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్ తో పాటు ఫైటో న్యూట్రియెంట్లు, విటమిన్లు, ఫైబర్ వంటివి కూడా ఉంటాయి. వీటిలో నీటి శాతం ఎక్కుకవగా ఉంటుంది. సమ్మర్ లో వీటిని తినడం వల్ల డీహైడ్రేట్ అవ్వకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. 

తాటిముంజల్లో క్యాన్సర్ల నుంచి రక్షించే గుణం కూడా ఉందని సైంటిఫిక్ గా రుజువైంది. ఇవి కొన్ని రకాల ట్యూమర్లు, బ్రెస్ట్ క్యాన్సర్లు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తుందట. కాబట్టి వీటిని ఎక్కువ తినడం ద్వారా క్యాన్సర్  రిస్క్ తగ్గించుకోవచ్చంటున్నారు. 

తాటిముంజల్లో శరీరానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్లతోపాటు మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ.  వీటిని తీసుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చు. దీంతోపాటు జీర్ణ సమస్యలు రాకుండా నియంత్రిస్తాయి. లివర్ సమస్యలను కూడా తగ్గిస్తాయట. 

ఈ తాటిముంజలు ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్యానికి చాలా మంచివి. సమ్మర్ లో తరుచుగా తాటిముంజలు తినడం ద్వారా శరీరం కోల్పోయే ఎలక్ట్రోలైట్స్ ను తిరిగి పొందొచ్చు. ఇవి అలసిపోయిన వారికి తక్షన శక్తిని అందిస్తాయి. తాటిముంజలు ముఖం పై వచ్చే మచ్చలు, పొక్కులను కూడా తగ్గిస్తాయట.