Summer Season ​ఎనర్జిటిక్​ ఫుడ్​.. చద్దన్నం తినాల్సిందే...

పెద్దల మాట చద్దన్నం మూట అనే సామెతను వినని వారు ఇంట్లో ఉపయోగించని తెలుగు వారు ఉండరు. చద్దన్నం ఎంత ఉపయోగకరమనేది ఈ సామెతలోనే ఉంది. ఆ చద్దన్నంను అసలెలా తయారు చేస్తారు వాటిలో ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతారో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆరోగ్యానికి ఈ చద్దన్నం చాలా మంచిది. అమెరికన్లు కూడా ఈ చద్దన్నంపై మక్కువ చూపుతున్నారు. వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా వుంచుతుంది. దీనిని ప్రోబయోటిక్ ఫుడ్ క్యాటగిరీలో చేర్చారు. 

పూర్వకాలంలో అంటే మన తాతల తండ్రులు.. ఎంత ఆరోగ్యంగా ఉండేవారంటే... 90 ఏళ్లు దాటినా.. అలుపు.. సొలుపు లేకుండా పని చేసేవారు. వారికి మందు బిళ్లన్నా.. ఇంజక్షన్​ అన్నా తెలియదు.  ఎండాకాలంలో కూడా ఎంతో చలాకీగా ఉండేవారు.  అయితే వారి ఫుడ్​ ఎలా ఉండేదంటే...ఇప్పటి జనరేషన్‌కు చద్దన్నం గురించి తెలిసినే నేరుగా తినే అవకాశాలు చాలా తక్కువ. పూర్వం వ్యవసాయం చేసే వాళ్లు ఎక్కువగా ఈ చద్దన్నం మూటను పొలంలోకి తీసుకొని వెళ్లి తినేవారు. ఇప్పుడు చద్దన్నం చేసుకోవడం చాలా తగ్గింది. కానీ కొన్ని హోటల్స్ మెనూలో ఈ చద్దన్నం లభిస్తుంది.  

ఎలా తయారు చేయాలంటే ...

 ముందుగా ఒక కప్పు బియ్యాన్ని కుక్కర్‌లో వేసి అందులో మూడు నుంచి నాలుగు కప్పుల నీళ్లతో రైస్‌ను వండుకోవాలి. చద్దన్నంకు  గంజి కావాలి కాబట్టి అదనంగా గంజికోసం మనం రైస్‌లో రెండు కప్పుల నీళ్లు ఎక్కువగా పోయాలి.  అంటే  సాధారణంగా తినే రైస్‌కు ఒక కప్పు రైస్‌కు రెండు కప్పుల నీళ్లను పోస్తాము. . కానీ చద్దన్నం తయారు చేసే వారు  నాలుగు కప్పుల నీళ్లను పోయాలి

అన్నం బాగా ఉడికిన తరువాత స్టవ్ మీద నుంచి కిందకు దించుకొని గంజిని సెపరేట్ చేయాలి. ఇప్పుడు చద్దన్నాన్ని  కలపడానికి ఓ మట్టిపాత్రను తీసుకోవాలి. మట్టి పాత్రలో చద్దన్నం పెట్టుకుంటే రుచి మరింత కమ్మగా ఉంటుంది. ఒక బౌల్‌లో రైస్‌తీసుకొని మట్టిపాత్రలో వేసుకోవాలి. ఒక కప్పు గంజి తీసుకొని అన్నంలో వేయాలి. ఒక కప్పు వేడివేడి చిక్కటి పాలను కూడా పోసి కలుపుకోవాలి. పాలల్లో అన్నం పలచగా కలవడానికి మరికొన్ని పాలు కావాలంటే పోసుకోవాలి. అందులోని పాలు గోరువెచ్చగా ఉండాలి. ఎందుకంటే పెరుగువేసి కలిపితే అప్పుడు మాత్రమే సరిగ్గా తోడుకుంటుంది. అన్నంలో పెరుగుతోడు పెట్టడానికి ఒక స్పూన్ పెరుగుతీసుకొని రైస్‌లో వేసి బాగా కలపాలి. రైస్‌ను బాగా కలిపి రైస్‌పైన ఐదు ఉల్లిపాయ ముక్కలను, ఐదు మిరపముక్కలను రైస్‌పైన వేయాలి. కానీ అందులో కలుపకూడదు. తరువాత మట్టిపాత్రకు మూత పెట్టి 12 గంటల వరకు అలాగే ఉంచితే అన్నంలో పెరుగు తోడుకుంటుంది

 12 నుంచి 15 గంటల తరువాత మట్టిపాత్రను ఓపెన్ చేస్తే చద్దన్నం పెరుగులో గట్టిగా తోడుకున్నట్టు మనకి కనిపిస్తుంది. ఇక ఒక ముద్దను నోట్లో పెట్టుకొని ఉల్లిపాయ, మిరపకాయను కొరికితే ఆ రుచిని మాటల్లో చెప్పలేము. మరింకెందుకు ఆలస్యం వేసవిలో  మీకు కావలసినన్ని సార్లు ఈ బయోటిక్ ఫుడ్‌ను తినండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..