Summer deceases : వేసవిలో చేసే జలుబుకు పెద్ద ప్రత్యేక లక్షణాలేమీ ఉండవు. శీతాకాలపు జలుబు మాదిరిగానే ఉంటుంది. వేడి వాతావరణంలో జలుబు వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుందట.ఈ సంవత్సరం ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. భానుడి ఏ మేరకు ప్రతాపంచూపించాడో అందరకు తెలిసిందే. ఎండ వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా వేధించే ప్రమాదం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో డీహైడ్రేషన్, ఎండ దెబ్బకు కొందరు ఆనారోగ్యం పాలైతే, మరికొందరిని వేసవిలో జలుబు, దగ్గు కూడా వేధిస్తుంది. అసలు వేసవిలో జలుబు ఎందుకు చేస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? వాటిని నివారించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి వివరాలు తెలుసుకుందాం. . .
సాధారణంగా వర్షాకాలం, శీతాకాలాల్లో అంటువ్యాధులు త్వరగా వ్యాపిస్తాయని అంటారు. కానీ మన జీవన శైలి మారుతున్నట్టే సూక్ష్మజీవులు కూడా వాటి స్వభావాన్ని మార్చుకుంటున్నాయి. అందువల్ల వేసవిలో ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తున్నాయి. వేసవిలో జలుబు, దగ్గుకు ప్రధాన కారణం అలర్జీలు, వైరస్ సంక్రమణ వల్ల అని చెప్పుకోవచ్చు. వ్యక్తిగత శుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల శరీరంలోకి దుమ్ము చేరి అలర్జీలకు కారణం అవుతుంది.
వేసవిలో బలమైన వేడి గాలులు వీస్తాయి. ఈ గాలి ద్వారా పుప్పొడి, దుమ్ము వంటి అలర్జీ కారకాలు వ్యాపిస్తాయి. ఇవి శరీరంలో చేరినపుడు జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉంటుంది. వేడి భరించలేక ఈ మధ్య చాలా మంది ఎక్కువ సమయాన్ని ఏసీ గదుల్లోనే గడుపుతున్నారు. ఏసిలో ఎక్కువ సమయం గడిపేవారిలో డ్రైనెస్ పెరుగుతుంది. ముక్కు, చెవి, నోటిలోపలి పొరల్లో కూడా పొడిబారుతుంది. ఇలా జరిగినపుడు ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయి. ఫలితంగా జలుబు దగ్గు వేధించవచ్చు. ఇంట్లో ఒకరికి జలుబు చేస్తే అందరికీ ఇది వ్యాపించే ప్రమాదం ఉంటుంది. జలుబు వైరస్ చాలా సులభంగా వ్యాపిస్తుంది.
లక్షణాలు
- తుమ్ములు రావడం
- ముక్కు కారడం
- ముక్కు దిబ్బడ
- గొంతులో దురద, నొప్పి
- పొడి లేదా కఫంతో కూడిన దగ్గు
- వేడిగా అనిపించడం, చెమటలు
- జ్వరం
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ఇంటి నుంచి బయటకు వెళ్తున్నపుడు తప్పకుండా మాస్క్ ధరించాలి. ఇది దుమ్మూ, దూళీ శరీరంలో ప్రవేశించకుండా ఆపుతుంది.
- ఎవరైనా జలుబు, దగ్గుతో బాధపడే వారు ఎదురైతే వారికి తగినంత దూరాన్ని పాటించడం అవసరం. ఈ జాగ్రత్తతో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు.
- ఇంటిని, పనిచేసుకునే ప్రదేశాన్ని ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
- డయేరియాతో బాధపడుతున్నా కూడా నిరోధక వ్యవస్థ బలహీన పడి జలుబు,దగ్గు సంక్రమించే ప్రమాదం ఉంటుంది