Summer Special : ఎండాకాలంలో పిల్లలు, పెద్దలు ఇవి తినండి.. ఇలా తాగండి.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఎండలు దంచుడు షురూ అయ్యింది. కొన్ని ఊర్లలో టెంపరేచర్ ఇప్పటికే 40 డిగ్రీలు దాటింది. ఇంకో రెండు వారాల్లో 50 డిగ్రీలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వాతావరణంలో మార్పులతో ఆరోగ్యం పాడయ్యే చాన్స్ ఉంటది. అందుకే సరైన లైఫ్ స్టైల్ ని పాటిస్తే ఈ సమ్మర్ను కూల్, హెల్దీగా గడపొచ్చు. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం...

రిఫ్రెషింగ్

సాధారణంగా వేసవిలో శరీరంలోని మలినాలు చెమట రూపంలో బయటకు వచ్చేస్తాయి. కాబట్టి స్నానం చేయడం కంపల్సరీ. లేకుంటే ఇన్ఫెక్షన్లు వస్తాయి. వీలైతే రెండు పూటలా స్నానం చేయాలి. చర్మగ్రంథులపై పేరుకుపో యిన మురికి, వ్యర్థాలను 'సృబ్బింగ్ పద్ధతి'లో బయటకు పంపొచ్చు. స్నానం చేసేప్పుడు సబ్బింగ్ కోసం బీరపీచు, కాటన్ రుమాలు, హ్యాండ్ టవల్స్ వంటివి వాడొచ్చు. అదే విధంగా తినే ముందు, తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడు క్కోవాలి. బస్సుల్లో ప్రయాణించేవాళ్లు శుభ్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. 

చర్మ సంరక్షణ

చర్మంపై రంధ్రాలు మూసుకుపోయే స్మిస్ క్రీమ్స్ వాడకపోవడం ఉత్తమం. అవసరమైతే ప్రత్యేకించి దొరికే సన్ స్కిన్ లోషన్స్ వాడొచ్చు. 

నీరే ఆధారం

వేసవిలో జలవనరులు ఎలా ఆవిరి అవుతాయో... అలానే శరీరంలోని నీటి శాతమూ తగ్గిపోతుం ది. దానిని భర్తీ చేసుకోకపోతే డీహైడ్రేషన్ కు లోనవుతాం. వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యలకు డి హైడ్రేషన్ ముఖ్యకారణం. అందుకే పొద్దున్న లేచి నప్పటి నుంచి కొద్ది కొద్దిగా మంచినీరు.. రోజంతా తీసుకుంటూ ఉండాలి. ప్రతి పావుగంట లేదా అరగంటకు ఒకసారి నీళ్లు తాగాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్బూజ, బొప్పాయి వంటి పండ్లు తినటం మంచిది. పండ్ల రసాలు, మంచినీరు, కొబ్బరినీళ్లు, ఇంటిలో తయారుచే సుకున్న వెజిటబుల్ సూప్స్ వంటివి. వేసవిలో రోజంతా తప్పక తీ సుకోవాల్సిన హెల్త్ డ్రింక్స్. ఎలక్ట్రోల్ పౌడర్ వెంట పట్టుకెళ్ల మంచిది.

ఇవి కూడా నేర్పించండి

వేసవి సెలవులంటే.. పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు పేరెంట్స్ కి దొరికే అవకాశం. వాళ్లను సంతోష పెట్టడానికి ఇంతకంటే మంచి మార్గం ఉండదు. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, డ్యాన్స్ వంటి ఇతర నైపుణ్యాలని పెంపొందించుకునే అవకాశాలను ఇవ్వాలి. అదేవిధంగా వాళ్లను కొన్ని విషయాలు, బాధ్యతలను అలవర్సేందుకు ప్రయత్నించాలి. చిన్న చిన్న ఇంటిపనులు నేర్పించాలి. ఇంట్లో అవసరం లేని వస్తువులను, పుస్తకాలను తీసేయించి.. అవసరమైన వాళ్లకు డొనేట్ చేయించాలి. అలాగే మొక్కలను పెంచటం, కూరగాయలు కొనటానికి మీతో తీసుకువెళ్లడం వల్ల వాళ్లకి కొన్ని విషయాలు తెలుస్తాయి. పచ్చని ప్రకృతి ప్రాంతాల్లో విహారయాత్రలను ప్రణాళిక వేసుకుని, అమలు చేయాలి. ఇంటి పెద్దలతో, చుట్టాలతో కొంత సమయాన్ని గడిపేలా చూస్తే వాళ్లకు పోతుంది.

డైట్ విషయంలో...

వేసవిలో ఎటువంటి ఆహారం శరీరాని కి అవసరమో గుర్తించి ఆ డైట్ తినాలి. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్ మెనూలో తప్పకుండా ఉండాలి. ఇవన్నీ మన శరీ దానికి వేసవిలో కావాల్సిన పోషణను ఇచ్చేవి. అదే విధంగా వేసవిలో వేపుళ్లు. మసాలా ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండాలి. నాన్ వెజ్ మితంగా తీసుకో వాలి. ఆవిరిపై ఉడికించిన కూరగాయ లు, పచ్చిగా లేదా సగం ఉడికించిన సలాడ్స్ తింటే ఆరోగ్యానికి మంచిది.

పిల్లల డైట్.. చూస్తున్నరా?

పిల్లలకు మాత్రం వేసవి అంటే సెలవులు. బాగా ఎంజాయ్ చేయడానికి ఒక మార్గం. అయితే సమ్మర్ హాలీడేస్ గురించి ఈ మధ్య ఒక అంతర్జాతీయ సంస్థ చేపట్టిన సర్వేలో " ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. పిల్లలు ఏడాది మొత్తంలో కంటే.. వేసవిలోనే మూడింతల బరువు పెరుగుతున్నారంట! దీనికి కారణం టైమ్ సెన్స్ లేకుండా ఫుడ్ తీసుకోవడం, పోషక విలువలు లేని స్నాక్స్ అతిగా తినటం కారణం. అంతేకాదు ఫిజికల్ గేమ్స్ శరీరాన్ని కదిలించే ఆటలు) కాకుండా. వీడియో గేమ్స్, టీవీ షోలతో గడపటమే అని తేలింది. కాబట్టి, పిల్లల డైట్ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త పాటించాలి. అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

కప్పేసుకోండి

ఈ ఎండలో సూర్య కిరణాలు చర్మానికి అంత మంచివి కావు. ప్రయాణాల్లో తలకు, ముఖానికి క్లాత్ కట్టుకుని తిరగాలి. నూలు, లెనిన్ తో తయారు చేసిన వస్త్రాలు, వదులుగా ఉండి, లేత రంగుల దుస్తులు వేసుకోవాలి. ఉదయం పది గంటల తరువాత బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, మంచినీళ్లు వెంట తీసుకెళ్లాలి. యూవీ కిరణాలు కంటికి మంచివి కావు. అందుకే కూలింగ్ కళ్లద్దాలు మెయింటెయిన్ చేయాలి.

ఇట్లా చెయ్యండి

• విహాదయాత్రలు, బయట తిరిగేటప్పుడు చెట్ల నీడలో నడవటం, అలసిపోతే సేద తీరటం చెయ్యాలి.
• మూగజీవాలకు నీళ్లు అందుబాటులో ఉంచాలి.
• ఏసీలను 25-27 డిగ్రీల మధ్యలో ఉంచాలి. దీనివల్ల బయట వాతావరణంలోకి వెళ్లాల్సి వచ్చినా తట్టుకోగలుగుతారు.
• అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్న సమయంలో బయట తిరగకపోవడమే ఉత్తమం.
• బయటకు వెళ్లే ముందు మంచినీళ్లు, మజ్జిగ, నిమ్మరసం.. తాగడం వల్ల వడదెబ్బ తగలదు.

వ్యాయామం

మన శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో.. వ్యాయామం అంటే ముఖ్యం. అయితే వేసవిలో హెవీ ఎక్సర్ సైజులు అస్సలు మంచిది కాదు. నడక, యోగా, వాకింగ్, ఏరోబిక్స్, డ్యాన్స్ వంటి ఇండోర్ ఎక్సర్ సైజ్ లు చేయాలి. సాయంత్రం వేళల్లో గార్డెనింగ్, నడక.. ఇలాంటి అవుట్ డోర్ యాక్టివిటీస్ మంచిది. ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ వంటివి ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయటం వలన శరీరం డీహైడ్రేషన్ కు గురికాదు.. అలసిపోదు.