Astrology: జులై 7న కర్కాటక రాశిలోకి శుక్రుడు.. నాలుగు రాశుల వారికి రాజయోగం.. మిగతా రాశుల వారికి ఎలా ఉందంటే...

జూలై 7న శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో శుక్రుడు, బుధుడు కలవబోతుండడం వల్ల లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది. అంతే కాకుండా, శుక్రుడు సూర్యునితో కలిసి శుక్రాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తాడు.  కర్కాటక రాశిలో . శుక్రుడు జూలై 30 వరకు ఉంటాడు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కర్కాటకంలో శుక్రుడి సంచారం  నాలుగు రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.  మిగతా రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .  . 

శుక్రుని సంచారం కొన్ని రాశులపై సానుకూల ప్రభావాన్ని, మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. శుక్రుడు సంపద, వాక్చాతుర్యం, కుటుంబ జీవితం, తెలివితేటలు మరియు చాతుర్యానికి బాధ్యత వహిస్తాడు.    శుక్రుడు జులై చివరి రోజున కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి వెళ్తాడు. సింహ రాశికి వచ్చిన శుక్రుడు, బుధుడు చేరి లక్ష్మీనారాయణ రాజయోగాన్ని ఏర్పరుస్తారు. అంటే జులైలో శుక్రుని వల్ల ఒకటి కాదు రెండు రాశుల్లో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది.  జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. .  . .

మేషరాశి  : ఈ రాశి వారికి  శుక్రుడి ద్వంద్వ సంచారం అత్యంత శుభప్రదం కానుంది. వ్యాపారంలో విజయం సాధించడంతో పాటు  సంపద కూడా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. . కొత్త కెరీర్ అవకాశాలు వస్తాయి.  కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. కొత్త ఆస్తి లేదా కొత్త కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  వైవాహిక సంబంధాలలో ఆనందాన్ని పొందుతారు. పరిహారంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పాయసాన్ని ప్రసాదంగా సమర్పించండి.

వృషభరాశి : శుక్రుడు కర్కాటకరాశిలో సంచారం కారణంగా మీరు చేసే వృత్తిలో ప్రశంసలు పొందుతారు.  కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి.  వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. వివాహ ప్రతిపాదనలు కలసి వస్తాయి. అన్నదమ్ముల మధ్య అనుబంధం మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామి మద్దతుతో, అనేక పనుల్లో విజయం సాధించగలరు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. కాని అనుకోకుండా ఖర్చులు పెరిగే  అవకాశం ఉంది.  ఇంట్లో పెద్దవారికి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కావున ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణ చేయండి.

మిథునరాశి : శుక్రుడు ..కర్కాటక రాశిలో సంచారం వలన మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ప్రత్యేక మార్పులు ఉండే అవకాశం ఉందని ఆస్ట్రాలజీ నిపుణులు చెబుతుతున్నారు.  వారసత్వంగా కొంత ఆస్తి వచ్చే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు స్థాన చలనం కలిగే అవకాశం ఉంది.  ఆర్ధిక పరంగా ఎలాంటి మార్పులు ఉండవు.  విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి విజయం సాధించే అవకాశం ఉంది. అయితే అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. దీంతో శరీర బడలికతో పాటు కొంత అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. నవగ్రహాల స్తోత్రం ప్రతిరోజు పఠించండి. 

కర్కాటకరాశి  : శుక్రుని సంచారం కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా శుభాలు ఇవ్వనుంది. శుక్రుడి శుభ ప్రభావం వల్ల జీవితంలో ధన ప్రవాహం పెరుగుతుంది. సౌలభ్యం కూడా పెరుగుతుంది. వ్యాపారంలో డబ్బు సంపాదన పెరగడం వల్ల వ్యాపారం బాగుంటుంది. ఆకస్మికంగా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. కెరీర్‌లో పురోగతి సాధించే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక స్థితి మరియు కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. మెరుగుదల కోసం సానుకూల ప్రయత్నాలు చేస్తారు. దీనికి పరిష్కారంగా ప్రతి శుక్రవారం ఆవుకు పచ్చి నారును ఆహారంగా  ఇవ్వాలి.

సింహరాశి: ఈ  రాశి వారికి శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం  శుభ ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ఈ రాశివారు  వివిధ రంగాలలో విజయాన్ని పొందే అవకాశం ఉంది. అదే సమయంలో డబ్బును కూడా ఖర్చు చేస్తారు. అయితే డబ్బును పెట్టుబడులు పెట్టే దిశగా ఖర్చు చేస్తారు. సుఖంగా, సంతోషంగా జీవిస్తారు. ఆర్థిక పరంగా కొంత పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.  అయితే ఏదో తెలియని మానసిక ఆవేదనతో ఉంటారు.  విష్ణు సహస్రనామం..,చదవడం కాని వినడం కాని చేయండి. 

కన్యారాశి : ఈ రాశివారికి ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి.  కొత్తకొత్త  ప్రయోగాలు చేపడతారు.  ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు.  అయితే కొంత ధనం వృధాగా ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈ రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో సామాన్య ఫలితాలుంటాయి.  ఉద్యోగస్తులకు ఎంత కష్ట పడితే అంత ఫలితం ఉంటుంది. కొత్తగా ఉద్యోగాలు మారాలనుకునే వారు అలాంటి ప్రయత్నాన్ని వాయిదా వేసుకోండి. అనవసరంగా మీపై నింద పడే అవకాశం ఉంది.  ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. . ప్రేమ భాగస్వామికి వినూత్నమైన కానుకలతో ముంచెత్తడం కూడా జరుగుతుంది. కొత్తవారికి ప్రేమ అవకాశాలు ఏర్పడతాయి. ప్రతి రోజు హనుమాన్​ చాలీసా పారాయణ చేయండి. 

తులారాశి :  తులారాశి వారికి శుక్రుని స్థానం చాలా శుభప్రదం. వ్యాపారంలో ఊహించని విజయాన్ని పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆకస్మిక విజయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. భౌతిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, వ్యాపారంలో మెరుగుదల, పురోగతి మార్గంలో ముందుకు సాగుతారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. కార్యాలయంలో గౌరవం కూడా లభిస్తుంది. దీనికి పరిష్కారంగా, ప్రతి శుక్రవారం నిరుపేదలు పండ్లు దానం చేస్తే మంచిది.

వృశ్చిక రాశి: :శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం వలన వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయాలి, ఏదో ఒక కారణంగా  అనవసరంగా మీ ప్రమేయం లేకుండా కలహాలు, కలతలు ఏర్పడుతాయి, ఆవేశానికి లోనుకాకండి. ఎవరితోనూగ్వాదం పెట్టుకోవద్దు. ప్రేమ భాగస్వామి నుంచి ఆశించిన సహకారం, అవగాహన లభించకపోయే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు రెండు నెలల పాటు ఇబ్బంది పెడతాయి.  కొద్ది కాలం పాటు తామరాకు మీద నీటి బొట్టులా ఉండడం మంచిది. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ప్రతి రోజు సూర్యాష్టకం పఠించండి. 

ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఆవేశం తగ్గించుకోండి.  దూకుడు స్వభావం కలిగి ఉండటం వలన తప్పటడుగు వేశామా అన్న ఆలోచన వస్తుంది. స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం, నిజాయతీ లోపించడం వంటివి అనుభవానికి వస్తాయి.  ఓ రెండు నెలల పాటు ఏ విషయంలోనూ తొందరపాటు వ్యవహారాలు పనికి రావు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. అయితే శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండటం వలన కొంత వరకు మేలు జరిగే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులు బాగా కష్ట పడాల్సి వస్తుంది. ఆర్ధికంగా సమయానికి డబ్బు చేతికి అందుతుంది.  నిత్యం హనుమాన్​ చాలీసా పారాయణం తో పాటు.. శివాలయాన్ని దర్శించండి. 
 
మకర రాశి: ఈ రాశి  వారికి శుక్రుని ద్వంద్వ సంచారం వలన ఎంతో మేలు కలుగుతుంది. ఈ సమయంలో డబ్బు సంబంధిత సమస్యలు జీవితం నుండి దూరమవుతాయి. వ్యాపారం కూడా బాగుంటుంది. ఉద్యోగం, జీతం పెరుగుదల, ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంట్లో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బకాయిలు తిరిగి పొందుతారు. వ్యాపారంలో గొప్ప పురోగతి ఉంటుంది. దీనికి పరిష్కారంగా శుక్రవారం పేదలకు వస్త్రదానం చేస్తే మంచిది.

కుంభరాశి : శుక్రుడు కర్కాటక రాశిలో  సంచారం చేయడం వల్ల ఈ రాశి వారు కెరీర్ పరంగా మంచి ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో ఉద్యోగానికి సంబంధించి మీరు చాలా దూరం ప్రయాణం చేయాల్సి రావొచ్చు. డబ్బు సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. మీరు అనేక ప్రయోజనాలు పొందుతారు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.

 మీన రాశి:  ఈ రాశి వారు శుక్రుని సంచారం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. మీరు మీ పనులన్నింటినీ క్రమ పద్ధతిలో పూర్తి చేస్తారు. మీరు పాత పథకాల నుంచి ప్రయోజనం పొందుతారు. మీ పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఈ సమయం మంచిగా ఉంటుంది. మీరు మెరుగైన లాభాలను పొందుతారు. వృత్తి , వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.  కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం  ఉంటుంది,  ప్రేమ యాత్రలు, విహార యాత్రలు చోటు చేసుకుంటాయి. విలువైన కానుకలు కొనిపెట్టడం జరుగు తుంది. ప్రేమ వ్యవహారాలు ఈ రెండు నెలల పాటు చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.  ప్రతి రోజు అమ్మవారిని ఎర్ర పూలతో పూజించండి.