జుట్టు సమస్యలా.. బాధ ఎందుకు దండగ.. ఆలివ్ ఆయిల్ ఉందిగా.. అండగా..

రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం, జీవనశైలిలో మార్పుల కారణంగా జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎక్కవవుతున్నాయి. జుట్టు పొడిబారడం, నిర్జీవంగా మారడం, రాలడం అనేది సాధారణ సమస్యగా మారింది. జుట్టు సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులు మార్కెట్‌లో పుష్కలంగా లభిస్తాయి. అయితే, ఇలాంటి జుట్టు సమస్యలకు ఆలివ్​ ఆయిల్​ తో  చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిని కరెక్ట్‌గా అప్లై చేస్తే.. జుట్టు సంరక్షణలో ఉత్తమ ఫలితాలుంటాయంటున్నారు.

పాతికేళ్లు కూడా రాకముందే జుట్టు ఊడిపోవడం, తెల్లబడిపోవడం వంటి సమస్యలతో యువత సతమతమవుతోంది. అబ్బాయిలేమో బట్టతల
వచ్చేసిందని.. అమ్మాయిలేమోజుట్టు పల్చగా మారిపోయిందని డిప్రెషన్లోకి వెళ్తున్నారు. అలాగే జుట్టు సమస్యలకు ఎన్నో చిట్కాలు ప్రయోగించి విసిగిపోతుంటారు. 
 జుట్టు సమస్యలతో బాధపడేవాళ్లు ఆందోళన చెందకుండా ఆలివ్ ఆయిల్ వాడితే పరిష్కారం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. 

ALSO READ | ప్రతి విషయంలో పాజిటివ్ మైండ్సెట్ తో ఉండాలంటే.?

ఆలివ్ నూనెలో ఉండే విటమిన్ -ఇ, యాంటీ ఆక్సిడెంట్లు తల మీద ఉన్న చర్మాన్ని మృదువుగా చేస్తాయి. ఆ నూనెతో మర్దనా చేయడం వల్ల జుట్టు పొడిబారడం, తెల్లబడటం వంటి సమస్యలు తగ్గడంతో పాటు కుదుళ్లు దృఢంగా మారతాయి. అలాగే చుండ్రు కారణంగా పొడిబారిన జుట్టుకి ఆలివ్ నూనెతో మర్దన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆలివ్ నూనెతో మర్దనా చేయడం వల్ల ఎండవేడిమి కారణంగా ఆగిపోయిన మెలనిన్ వర్ణద్రవం తిరిగి ఉత్పత్తి అయ్యి కురులు నల్లగా నిగనిగలాడతాయి. అంతేకాదు, రసాయనాలు కలిసిన షాంపూలు వాడటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. అలాంటప్పుడు ఆలివ్ నూనెతో బాగా మర్దనా చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.  ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే.. జుట్టు నల్లగా, మృదువుగా మారుతుంది.

ALSO READ | Beauty Tips: ఇది ఆరోగ్యానికే కాదు.. తెల్లజుట్టును తగ్గిస్తుంది.. బ్లాక్ హెయిర్ ను పెంచుతుంది

తలస్నానం చేసినా కొన్నిసార్లు జుట్టులో మెరుపు కనిపించదు. బలహీనంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు కాచి చల్లార్చిన గ్రీన్‌ టీని ఆలివ్‌ నూనెలో కలిపి జుట్టుకి రాసి ఆరనివ్వాలి. తర్వాత గంటాగి తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. మెరుపూ కనిపిస్తుంది. చుండ్రు కారణంగా పొడిబారిపోయిన జుట్టుకి ఆలివ్‌నూనెతో మర్దన చేయడం వల్ల మంచి పలితం ఉంటుంది. ఆలివ్‌ నూనెతో మర్దన చేయడం వల్ల ఎండవేడిమి కారణంగా ఆగిపోయిన మెలనిన్‌ వర్ణద్రవ్యం తిరిగి ఉత్పత్తి అవుతుంది. దీంతో కురులు నల్లగా నిగనిగలాడతాయి.

జుట్టు బలహీనంగా మారి ఊడిపోతున్నప్పుడు కొబ్బరిపాలల్లో చెంచా ఆలివ్‌నూనె, కాస్త కలబంద గుజ్జు, మూడు గుడ్లలోని తెల్లసొన కలిపి బాగా గిలకొట్టి తలకు పూతలా వేసుకోవాలి. అరగంట తర్వాత గాఢత తక్కువ షాంపుతో తలస్నానం చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే నాలుగుచుక్కల అల్లం రసంలో కొద్దిగా ఆలివ్‌నూనె చేర్చి జుట్టు కుదళ్లకు పట్టించాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లు దృఢంగా మారతాయి.

ఆలివ్ ఆయిల్‌లో వెల్లుల్లి పొట్టును కాల్చిన పొడిని కలిపి తలకు రాసుకుంటే జుట్టు త్వరగా నెరవదు. ఆలివ్‌ ఆయిల్‌లో కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి, తలకు అప్లై చేయాలి. తర్వాత తలస్నానం చేస్తే జుట్టు మెత్తగా మారుతుంది. వెంట్రుకలు రాలిపోవటాన్ని నివారించవచ్చు