సుడా సమావేశంలో కీలక నిర్ణయాలు

కరీంనగర్, వెలుగు: పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(సుడా) మాస్టర్ ప్లాన్ పై ఈ నెలాఖరులో అభిప్రాయ సేకరణ చేపట్టాలని సుడా పాలకవర్గం నిర్ణయించింది. 'సుడా, రుడాలకు రెడీ కాని మాస్టర్ ప్లాన్లు' హెడ్డింగ్ తో శుక్రవారం ‘వీ6 వెలుగు’లో స్టోరీ పబ్లిష్ అయిన విషయం తెలిసిందే. స్పందించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తన ఆఫీసులో వైస్ చైర్మన్, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్,  ఇతర ఆఫీసర్లతో కలిసి మాస్టర్ ప్లాన్ పై చర్చించారు.

ఈ నెలాఖరులోపు మంత్రుల సమయం తీసుకొని మాస్టర్ ప్లాన్ పరిధిలోని ప్రజాప్రతినిధులు,  అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేయాలని నిర్ణయించారు. అలాగే  కమర్షియల్ బిల్డింగ్స్ పర్మిషన్ల చార్జీల విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం వల్ల లక్షలాది రూపాయలు రెవెన్యూ కోల్పోతున్నామని, ఇలాంటి బిల్లింగ్స్ కు వెంటనే నోటీసులు జారీచేయాలని తీర్మానించారు. డీపీఓ రవీందర్, చీఫ్ ప్లానింగ్ అధికారి కోటేశ్వర్, డీటీసీపీ  ఆంజనేయులు, ఈఈ యాదగిరి, డీఈ రాజేంద్ర ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.