ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సద్వినియోగం చేసుకోవాలి : కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

  • కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వెల్లడి

కరీంనగర్ సిటీ, వెలుగు : సుడా పరిధిలోని ప్రజలు ఎల్ఆర్ఎస్ ను సద్వినియోగం చేసుకోవాలని, ఎల్ఆర్ఎస్  ఉంటేనే నూతన ఇంటి నిర్మాణం కోసం అనుమతి పొందే అవకాశం ఉంటుందని సుడా చైర్మన్, నగర కాంగ్రెస్  అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని రోడ్లు భవనాల అతిథి గృహం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 26 ఆగస్టు 2020 తర్వాత వ్యవసాయ భూముల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేసుకునే అవకాశం కానీ బిల్డింగ్ పర్మిషన్ కానీ తీసుకునే అవకాశం లేదన్నారు. 

అప్రూవల్ లేఅవుట్ ప్లాట్ లకే ప్రాధాన్యం ఇస్తామన్నారు.సుడా పరిధిలో ఇప్పటివరకు ఇంకా 21 వేల  అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.పెండింగ్ అప్లికేషన్ల క్రమబద్ధీకరణ కోసం త్వరితగతిన క్లియర్ చేసుకోవాలని  సూచించారు. సుడా అప్లికేషన్ లను సవరించడానికి, అనుమతి కోసం, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు లాగిన్ ఇచ్చామన్నారు. 

 ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ దిక్సూచిలా ఉంటుందన్నారు. సమావేశంలో నాయకులు సయ్యద్ ఖమ్రోద్దీన్, కుర్ర పోచయ్య,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,దండి రవీందర్, లయక్, షబానా మహమ్మద్, జ్యోతి రెడ్డి, ముల్కల కవిత, తిరుమల, హసీనా  తదితరులు 
పాల్గొన్నారు.