యూట్యూబర్ : ఆర్ట్‌‌‌‌తో ఎంట్రీ..వ్లాగ్స్‌‌‌‌తో వైరల్‌‌‌‌

చదువుకోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితి. అయినా.. పట్టు వదలకుండా ఏదో ఒకటి సాధించాలనే కసితో పనిచేశాడు. యూట్యూబ్‌‌‌‌ ఛానెల్ పెట్టి వ్లాగ్స్ చేయడం మొదలు పెట్టాడు. అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించి డిఫరెంట్‌‌‌‌ కంటెంట్‌‌‌‌ అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేశాడు. అందుకే ఇప్పుడు సౌరవ్ జోషి ఇండియాలోనే టాప్ వ్లాగర్లలో ఒకడిగా ఎదిగాడు. తన ఈ జర్నీలో ఎన్ని సవాళ్లు ఎదురైనా అధిగమిస్తూ, అంకితభావంతో పనిచేసి అభిమానులను సంపాదించుకున్నాడు. 

సౌరవ్‌‌‌‌ది మధ్యతరగతి కుటుంబం. తండ్రి కార్పెంటర్‌‌‌‌‌‌‌‌ (వడ్రంగి). తల్లి గృహిణి. 1999 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌8న పుట్టాడు. ఉత్తరాఖండ్‌‌‌‌లోని సోమేశ్వర్ అనే చిన్న టౌన్. కానీ.. ఇప్పుడు హర్యానాలో సెటిల్ అయ్యారు. సౌరవ్‌‌‌‌ చిన్నతనం మొత్తం ఉత్తరాఖండ్‌‌‌‌లోనే గడిచింది. స్కూల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ అక్కడే పూర్తి చేశాడు. తర్వాత పంజాబ్‌‌‌‌ గ్రూప్ ఆఫ్‌‌‌‌ కాలేజ్‌‌‌‌ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌ పూర్తి చేశాడు. చదువుకుంటున్న రోజుల్లో పేదరికం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాడు. సౌరవ్​ తండ్రి రోజూ కష్టపడి పనిచేస్తే తప్ప పూట గడవని పరిస్థితి. అలాంటి టైంలో సౌరవ్‌‌‌‌ బ్యాచిలర్‌‌‌‌‌‌‌‌ డిగ్రీ చదవాలి అనుకున్నాడు. కానీ.. ఆ ఏడాది కాలేజీలో అడ్మిషన్ దొరకలేదు. అయినప్పటికీ ఆర్టిస్ట్‌‌‌‌ కావాలనే కోరికను వదిలేయకుండా ప్రాక్టీస్‌‌‌‌ చేస్తూనే మరో వైపు ఆదాయంకోసం మరో దారి వెతకడం మొదలుపెట్టాడు. 2017లో అతని యూట్యూబ్‌‌‌‌ ఫేమస్‌‌‌‌ అయ్యింది. దాంతో వ్లాగింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు సౌరవ్‌‌‌‌.

కానీ.. అప్పుడు అతని దగ్గర మంచి కెమెరా ఫోన్‌‌‌‌ కూడా లేదు. ఉన్నదాంతోనే వ్లాగింగ్‌‌‌‌ మొదలుపెట్టాడు. ఆ వీడియోలను ‘సౌరవ్‌‌‌‌ జోషి వ్లాగ్స్‌‌‌‌’ పేరుతో ఒక ఛానెల్‌‌‌‌ క్రియేట్‌‌‌‌ చేసి.. అందులో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేశాడు. వాస్తవానికి అతనికి కెమెరా ముందు మాట్లాడడం ఇష్టం ఉండేది కాదు. భయపడుతూనే వీడియోల్లో కనిపించేవాడు. కాలం గడిచేకొద్దీ అతని కృషి ఫలించింది. వీడియోలకు వ్యూస్‌‌‌‌ పెరిగాయి. కొన్నాళ్లకు వైరల్ అయ్యాయి. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. ఇప్పుడు ఇండియాలోని టాప్‌‌‌‌ వ్లాగర్లలో ఒకడిగా నిలిచాడు. 

మొదటి వీడియో 

ఛానెల్ పెట్టాక ఆర్ట్‌‌‌‌ వేస్తూ తన మొదటి వీడియో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేశాడు. ఆ తర్వాత కూడా వరుసగా రంగుల పెన్సిల్స్‌‌‌‌తో వేసిన డ్రాయింగ్ టైమ్-లాప్స్ వీడియోలనే అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేశాడు. అతని ఆర్ట్‌‌‌‌ని అందరూ మెచ్చుకున్నా... అనుకున్న స్థాయిలో వ్యూస్‌‌‌‌, సబ్‌‌‌‌స్క్రిప్షన్స్ రాలేదు. అప్పట్లో ధోని, హృతిక్ రోషన్, విరాట్ కోహ్లి, టైగర్ ష్రాఫ్ బొమ్మలు వేసిన వీడియోల వల్ల కొంత రీచ్ పెరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకు పూర్తిగా వ్లాగింగ్‌‌‌‌ మొదలుపెట్టాడు. 2019లో తన ఫ్యామిలీతో కలిసి ఒక వీడియో చేశాడు. అప్పటినుంచి ఛానెల్‌‌‌‌కు మంచి రీచ్ వచ్చింది. తర్వాత 2020 లాక్‌‌‌‌డౌన్ టైంలో 365 రోజుల్లో 365 వ్లాగ్స్‌‌‌‌ తీయాలనే టార్గెట్‌‌‌‌తో పనిచేశాడు. ప్రతి రోజూ వీడియో చేశాడు. ఆ వీడియోలు బాగా వైరల్‌‌‌‌ అయ్యాయి. దాంతో ఛానెల్‌‌‌‌కు కొత్త సబ్‌‌‌‌స్క్రయిబర్ల సంఖ్య వరదలా వచ్చింది

2021 నాటికి ఇండియాలో అత్యంత వేగంగా డెవలప్‌‌‌‌ అవుతున్న వ్లాగింగ్‌‌‌‌ ఛానెళ్ల లిస్ట్‌‌‌‌లో ‘సౌరవ్‌‌‌‌ జోషి వ్లాగ్స్‌‌‌‌’  కూడా చేరింది. ఛానెల్‌‌‌‌కు ఇప్పుడు 27.6 మిలియన్ల సబ్‌‌‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇప్పటివరకు 1700లకు పైగా వీడియోలు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేశాడు. వాటిలో 60 మిలియన్ల వ్యూస్ దాటిన వీడియోలు కూడా రెండు ఉన్నాయి. 
ప్రస్తుతం మెయిన్‌‌‌‌ ఛానెల్‌‌‌‌లో డైలీ వ్లాగ్స్‌‌‌‌ షేర్ చేస్తున్నాడు. దాంతో పాటు ‘సౌరవ్‌‌‌‌ జోషి ఆర్ట్స్‌‌‌‌’ పేరుతో ఒక స్పెషల్‌‌‌‌ ఆర్ట్ ఛానెల్‌‌‌‌ కూడా నడుపుతున్నాడు. అందులో అతను వేసిన స్కెచ్‌‌‌‌ ఆర్ట్ వేసే టైం లాప్స్‌‌‌‌ వీడియోలు పోస్ట్‌‌‌‌ చేస్తుంటాడు. 

కంటెంట్‌‌‌‌ క్రియేషన్‌‌‌‌

సౌరవ్ అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసే కంటెంట్ కొత్తగా ఉంటుంది. మఖ్యంగా ఫ్యామిలీ ఫ్రెండ్లీ కంటెంట్ మాత్రమే క్రియేట్‌‌‌‌ చేస్తాడు. అంటే అన్ని వయసుల వాళ్లు చూసే విధంగా ఉంటుంది. ఎవరినీ నొప్పించే మాటలు మాట్లాడడు. అందుకే ట్రెండ్స్​ ఫాలో కాకున్నా వ్యూస్‌‌‌‌ వస్తుంటాయి. సౌరవ్ యూట్యూబ్‌‌‌‌ ప్రయాణంలో వీడియోలను క్రియేట్‌‌‌‌ చేయడమే కాదు తనవంతుగా సోషల్ సర్వీస్‌‌‌‌ కూడా చేస్తున్నాడు. వెనుకబడిన కమ్యూటీల్లో అక్షరాస్యత కోసం ప్రయత్నిస్తున్నాడు. ఖర్చు పెట్టే స్థోమత ఉన్నన్ని రోజులు వీలైనంత ఎక్కువ మందికి సాయం చేస్తానంటున్నాడు.

సౌరవ్​ నెట్‌‌‌‌ వర్త్‌‌‌‌ ప్రస్తుతం 25 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. యూట్యూ బ్‌‌‌‌ ఛానెళ్ల నుంచి వచ్చే సంపాదనతోపాటు స్పాన్సర్‌‌‌‌షిప్‌‌‌‌లు, ఎండార్స్‌‌‌‌మెంట్లు,  ప్రమోషన్ల ద్వారా కూడా సంపాదిస్తున్నాడు.