Success Formula: సక్సెస్కు ఫార్ములాలు.. హెల్దీ డే కోసం ఇలా చేయండి..

రోజులో ఉండేవి కొన్ని గంటలే అయినా కొందరు చేసే పనులు మాత్రం ఎక్కువే. ఇదెలా సాధ్యం అంటే... రోజు ఉదయాన్నే లేవడమే సీక్రెట్. ఎక్కువ పనులు చేసినా వాళ్లలో వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉండదు. చాలా యాక్టివ్ గా ఉంటారు కూడా. మరి వాళ్లలా హెల్దీ డే కోసం ఏంచేయాలంటే!!!

ఉదయం నిద్ర లేచినపుడు ఉన్న మూడ్ ఎఫెక్ట్ ఆ రోజు చేసే పని మీద ఉంటుంది. హెల్దీ మార్నింగ్ వల్ల పనితో కలిగే ఎన్నో రకాల డిప్రెషన్స్, యాంగ్జెటీలను దూరం చేసుకోవచ్చు. 'ముందు మనం అలవాట్లను తయారుచేసుకుంటే... తరువాత ఆ అలవాట్లే మనల్ని తయారుచేస్తాయి' అనే దాన్ని ఫాలో అవ్వాలి. అందుకే రొటీన్ మార్నింగ్ హెల్త్ కోసం కొన్ని అలవాట్లు చేసుకోవాలి. వాటివల్ల మెంటల్, ఫిజికల్ స్ట్రెంత్ పెరుగుతుంది. 

నీళ్లు తాగాలి..

రాత్రి పడుకున్నప్పటి నుండి ఉదయం నిద్ర లేచేంత వరకు దాదాపుగా 8 గంటలు నీళ్లు తాగం. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఉదయం లేవగానే నీళ్లు తాగడం వల్ల శరీరంలో కండరాలు, అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. కొంతవరకు యాక్టివ్నెస్ వస్తుంది. లేదంటే డీహైడ్రేషన్ వల్ల నీరసించిపోతారు. ఉదయం నిద్ర లేవగానే పరగడుపున కొన్ని గోరువెచ్చని నీళ్లు తాగితే శరీరం క్లీన్ అయ్యి ఎనర్జీ వస్తుంది. 

మెడిటేషన్ ముఖ్యం

ఈ మధ్య మెంటల్ స్ట్రెస్ చాలామందిలో పెరిగిపోయింది. దీని వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీన్నుంచి బయట సక్సెస్ కి ఫార్ములాలు పడాలంటే రోజుకి పది నిమిషాలు మెడిటేషన్ చేయాలి.మెడిటేషన్తో చేసే పని మీద ఫోకస్ ఉంటుంది. మెడిటేషన్ చేసేవారిలో స్ట్రెస్, యాంగ్జెటీలు ఎక్కువగా కనిపించవు. అలాగే ఎక్సర్సైజ్ చేస్తే శరీరం ఫిట్గా ఉంటుంది. మెంటల్గా చురుగ్గా ఉంటారు. మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. మామూలుగా చేసే చిన్న చిన్న ఎక్సర్సైజ్ల వల్ల కూడా శరీరానికి లాభమే. 

ప్లానింగ్ అవసరం

రోజులో చేయాల్సిన పనిని ముందే ప్లాన్ చేసుకోవాలి. దాని వల్ల సగం స్ట్రెస్ తగ్గుతుంది. మల్టీ టాస్కింగ్ చేయగలిగినా ఒకేసారి పని భారాన్ని మోయడం వల్ల కూడా స్ట్రెస్ పెరుగుతుంది. ఒకేసారి నాలుగైదు పనులు మీదేసుకోకుండా.... ప్లాన్ చేసుకుని ఒక్కో పని చేసుకుంటూ పోతే స్ట్రెస్ లేకుండా ఉంటుంది.

ఫోన్ ను పక్కన పెట్టాలి

చాలా మంది లేవగానే చేసే మొదటి పని మొబైల్ ఫోన్, లేదా ల్యాప్టాప్స్ మెయిల్స్, మెసేజ్లు చూసుకుంటారు. ఇలా చేయడం వల్ల శరీరం వీక్ గా ఉంటుంది. అందుకే ఉదయం లేవగానే చేతిలోకి సెల్ఫోన్, ఒళ్లోకి ల్యాప్టాప్ తీసుకోవద్దు.

 బద్ధకం వద్దు

చాలా మంది బద్ధకం వల్ల పనిని పోస్ట్పన్ చేస్తుంటారు. అవసరం ఉన్నప్పుడు. చేయొచ్చులే అనుకుంటారు. దాని వల్ల చేయాల్సిన టైంలో పని పూర్తికాక స్ట్రెస్ మీద పడుతుంది. ఒత్తిడి వల్ల ఆ పని పూర్తి కాక, ప్రాజెక్ట్ ఇవ్వాల్సిన టైం ఇవ్వక గందరగోళంగా ఉంటుంది. అందుకే బద్ధకం పక్కన పెట్టి సాధ్యమైనంత తొందరగా పని పూర్తి చేస్తే ఒత్తిడి ఉండదు.

జీవితానికి అవసరమయ్యే కొన్ని అలవాట్లు మొదట కష్టంగా ఉన్నా, కొన్నాళ్లకు అలవాటవుతాయి. తరువాత వాటి వల్ల వచ్చిన రిజల్ట్స్ మనసుకు హాయినిస్తాయి.  

Also Read: ప్రేమ ఓ ప్రేమ అంటున్న గూగుల్ డూడుల్