పిల్లల ప్రశ్నలకు జవాబుల్లేవ్‌! ఆన్సర్‌‌ కోసం గూగుల్‌, ఏఐ, అలెక్సా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  ఇంట్లో పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తల్లిదండ్రులు తిప్పలు పడుతున్నారని ఓ స్టడీలో వెల్లడైంది. చిన్నారులు అడిగే చిన్న చిన్న ప్రశ్నలకు పేరెంట్స్‌‌‌‌ వెంటనే సమాధానాలు చెప్పలేకపోతున్నారని తెలిసింది. వాళ్లు అడిగే క్వశ్చన్లను తల్లిదండ్రులు గూగుల్‌‌‌‌ లేదా అలెక్సాను అడిగి తెలుసుకొని చెప్తుతున్నారని వెల్లడైంది. అమెజాన్‌‌‌‌ అలెక్సా, మార్కెటింగ్‌‌‌‌ డేటా అండ్‌‌‌‌ అనలిటిక్స్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ సంస్థ కాంతర్‌‌‌‌‌‌‌‌ నిర్వహించిన స్టడీలో ఈ వివరాలు తెలిశాయి. 

ఈ ఏడాది జూన్‌‌‌‌లో మొత్తం ఆరు సిటీల్లో 750 మంది తల్లిదండ్రులను సర్వే చేసినట్లు ఆ సంస్థలు వెల్లడించాయి. పిల్లలు అడిగే ప్రశ్నలకు 54 శాతం పేరెంట్స్‌‌‌‌ సమాధానాలు చెప్పలేక పోతున్నారని చెప్పింది. 52 శాతం మంది సమాధానం కోసం వెతుకున్నారని సర్వే చెబుతోంది. 80 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు అడిగే ప్రశ్నలకు అన్సర్‌‌‌‌‌‌‌‌ కోసం టెక్నాలజీని వాడుతున్నారని తేలింది. ప్రధానంగా గూడుల్‌‌‌‌ను, ఏఐని ఆశ్రయిస్తున్నారని చెప్పింది. 

టీవీ చూస్తున్నప్పుడే ప్రశ్నలు..

ప్రధానంగా 63 శాతం పిల్లలు పేరెంట్స్‌‌‌‌ టీవీ చూస్తున్నప్పుడే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని సర్వేలో తేలింది. 90 శాతం మంది తమ పిల్లలను ప్రశ్నలు అడగమని ప్రోత్సహిస్తున్నారని వెల్లడైంది. దాదాపు 92 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లల ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు తాము కూడా కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని చెప్పారు. 

గమ్మత్తైన ప్రశ్నలు..

చిన్న పిల్లలు అడిగే ప్రశ్నలు చాలా గమ్మత్తుగా ఉంటున్నాయని సర్వే వివరించింది. అవి సులభమైనవే అయినప్పటికీ కొంతసేపు గందరగోళంలో పడేస్తాయని తల్లిదండ్రులు అంటున్నారు. ‘కారును ఎలా తయారు చేయాలి?, విశ్వం ఎంత పెద్దది?, విమానం ఎలా ఎగురుతుంది?, చేపలు నీటి అడుగున ఎలా ఊపిరి పీల్చుకుంటాయి?’లాంటి ప్రశ్నలు వేస్తున్నారని తేలింది. 

వీటికి సమాధానాలు తెలిసినా.. పేరెంట్స్‌‌‌‌ మాత్రం వెంటనే చెప్పలేకపోతున్నారు. ప్రధానంగా టీవీ చూస్తున్న సమయంలో కాన్‌‌‌‌సెంట్రేషన్‌‌‌‌ అంతా స్ర్కీన్‌‌‌‌ మీదే ఉంటుంది. ఆ సమయంలో సడెన్‌‌‌‌గా ప్రశ్న అడిగితే వెంటనే సమాధానం చెప్పలేక పోవడం ప్రధాన కారణమని సర్వే చెబుతోంది. కాగా, ముఖ్యంగా పిల్లలు ఫుడ్‌‌‌‌, జంతువులు, ప్రకృతి, జనరల్‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌, హాలీడేస్‌‌‌‌, టెక్నాలజీ, సినిమాల గురించి అడుగుతున్నారని సర్వేలో వెల్లడైంది.