జాతీయ స్థాయి పోటీల్లో సెయింట్ పీటర్స్​ ప్రతిభ

హనుమకొండ సిటీ, వెలుగు : ఢిల్లీకి చెందిన అవంతిక గ్రూప్ ఆఫ్​ కాంటెంపరరీ ఆర్టిస్ట్స్​ అండ్​ ఇంటలెక్చువల్​ కలరింగ్​కాంపిటీషన్​ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన డ్రాయింగ్​ కాంపిటీషన్​ లో హనుమకొండ ఓల్డ్​ బస్​ డిపో సమీపంలోని సెయింట్ పీటర్స్​సెంట్రల్​ పబ్లిక్​ సీనియర్​సెకండరీ స్కూల్​ విద్యార్థులు ప్రతిభ చూపారు. ​ చిత్రలేఖనంలో ప్రథమ స్థా నంలో నిలిపారు.

వివిధ విభాగాల్లో సరోజగుప్త అవార్డ్స్​ 12, గోల్డ్​ మెడల్స్​39, సిల్వర్​ మెడల్స్​74, బ్రాంజ్​​ మెడల్స్​​78 సాధించి, రాష్ట్రంలోనే ఫస్ట్​ ప్లేస్ సాధించారు. స్కూల్​ ప్రిన్సిపల్​ డాక్టర్​ గోపు మథ్యాస్​ రెడ్డి, డైరెక్టర్​ సునీతారెడ్డి విద్యార్థులు, డ్రాయింగ్​ టీచర్​ రాపోలు శ్రీనివాస్​ ను అభినందించారు.