ప్రయాణం.. ప్రమాదకరం..రోడ్లపై జాగ్రత్త

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిన వంతెనపై నుంచి విద్యార్థులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. సూర్యా జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామ శివారులోని బ్రిడ్జి వర్షాలకు కుప్పకూలింది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే కందిబండలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో చదువుకునే విద్యార్థులు తమ గాంధీనగర్ తండాకు వెళ్లాలంటే కూలిన వంతెనపై నుంచే పోవాలి.

ఈ బ్రిడ్జి పక్కనే ఉన్న టెలిఫోన్ కేబుల్ వైర్లనుసైడ్ వాల్ గా పట్టుకుని పేరెంట్స్ తమ పిల్లలను బ్రిడ్జిని దాటిస్తున్నారు. అధికారులు త్వరగా బ్రిడ్జిని నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. మేళ్లచెరువు, వెలుగు