కోతులకు భయపడి స్కూల్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌పై నుంచి దూకిన స్టూడెంట్‌‌‌‌

  • విరిగిన కాళ్లు, వెన్నెముకకు తీవ్రగాయాలు
  • కరీంనగర్‌‌‌‌ మంకమ్మ తోట హైస్కూల్‌‌‌‌లో ఘటన

కరీంనగర్, వెలుగు: కోతుల గుంపు దాడికి యత్నించడంతో భయపడి స్కూల్ బిల్డింగ్‌‌‌‌ పైనుంచి దూకడంతో ఓ స్టూడెంట్‌‌‌‌ తీవ్రంగా గాయపడ్డాడు. కరీంనగర్‌‌‌‌ మంకమ్మతోటలోని ధన్గర్‌‌‌‌వాడీ గవర్నమెంట్‌‌‌‌ హైస్కూల్‌‌‌‌లో జరిగిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. బాధిత స్టూడెంట్‌‌‌‌ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... జ్యోతినగర్‌‌‌‌లోని ఓల్డ్‌‌‌‌ డీఐజీ బిల్డింగ్ ఏరియాకు చెందిన చెవులమద్ది రఘువర్ధన్‌‌‌‌ ధన్గర్‌‌‌‌వాడీ హైస్కూల్‌‌‌‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. 

గురువారం మధ్యాహ్నం భోజనం చేశాక ఫస్ట్‌‌‌‌ఫ్లోర్‌‌‌‌లోని క్లాస్‌‌‌‌రూమ్‌‌‌‌కు వెళ్తున్నాడు. ఈ టైంలో నాలుగైదు కోతులు ఒక్కసారిగా మీదికి రావడంతో భయపడిన రఘువర్ధన్‌‌‌‌ వెంటనే బిల్డింగ్‌‌‌‌ పైనుంచి కిందికి దూకాడు.  దీంతో రెండు కాళ్లు విరుగగా, వెన్నుముకకు తీవ్రగాయం అయింది. గమనించిన టీచర్లు వెంటనే జిల్లా హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. అక్కడి నుంచి వరంగల్‌‌‌‌ ఎంజీఎంకు తీసుకెళ్లారు.