నీట్ పేపర్ లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలి

  • విద్యార్థి సంఘాల ఆందోళన 

హుజూరాబాద్/ జమ్మికుంట/ ​ గోదావరిఖని , వెలుగు :  నీట్  పేపర్  లీక్​ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తూ.. హుజూరాబాద్,  జమ్మికుంట,  ​ గోదావరిఖని సెంటర్లలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేశారు. హుజూరాబాద్​లో యూత్​ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో   ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు.      గోదావరిఖనిలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేవారు. 

ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సాగర్, ఎన్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూఐ రాష్ట్ర కార్యదర్శి దుర్గ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు కష్టపడి  వేల రూపాయలు ఖర్చుపెట్టి నీట్ పరీక్ష రాస్తే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం కారణంగా పేప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రు లీకేజీ జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిగింద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నారు. ఇలాంటి మళ్లీ జరగకుండా   కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు కృష్ణ, శివ, శంకర్, సూర్య, ఎన్ ఎస్ యు ఐ నాయకులు వినోద్, రఘు, శ్రవణ్ రాజ్ పాల్గొన్నారు.