రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు తేజు ఎంపిక

హాలియా, వెలుగు : వచ్చే నెల 1, 2 తేదీల్లో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో అండర్ --17 విభాగంలో జరగనున్న రాష్ర్టస్థాయి ఫుట్​బాల్ పోటీలకు నల్లగొండ జిల్లా హాలియా పట్టణానికి చెందిన విద్యార్థి చింతల చెరువు తేజు ఎంపికయ్యాడు. ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుట్​బాల్ పోటీల్లో తేజు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు.

ఈ ఫుట్​బాల్ టీంకు తేజు కెప్టెన్​గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం అతడు చండూరు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్​లో పదో తరగతి చదువుతున్నాడు. రాష్ట్ర స్థాయికి ఫుట్​బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ప్రిన్సిపాల్ కె.అర్జున్,  కోచ్ లింగ్యా నాయక్ అభినందించారు.