Good Health : యుక్త వయస్సులో తక్కువ నిద్రతో వచ్చే ఇబ్బందులు ఇవే

పొద్దంతా ఏం చేసినా... రాత్రి నిద్రమాత్రం తప్పకుండా ఉండాలి. ఎంతకష్టపడినా కానీ, నిద్రనే మెదడుకు విశ్రాంతిని ఇస్తుంది. ఈ నిద్ర సరిగ్గా లేకపోతే హెల్త్ ఇష్యూలు వస్తాయి. తాజాగా చేసిన ఓ సర్వేలో కూడా ఇలాంటి నిజలే తేలాయి. సాధారణంగా.. ప్రతి వ్యక్తి ఏడు నుంచి 8 గంటలు నిద్రపోవాలి. కానీ ప్రస్తుతం చాలా మంది కేవలం నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే నిద్రపోతున్నారట. 

దాంతో చికాకు, కోపం, మనసును ఇబ్బంది పెట్టే ఇష్యూలు వస్తాయని తేలింది. హ్యూమన్ హెల్త్ సర్వే ఇటీవల చేసిన ఈ సర్వేలో నిద్ర లేకపోవడం వల్ల డిప్రెషన్ కు గురయ్యే ప్రమాదం దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉందని తేలింది. 

ఈ సర్వేలో 55 శాతం మంది స్టూడెంట్లు ఈడీఎస్ (ఎహ్లర్స్ డన్లోస్ సిండ్రోమ్ ) సమస్యతో బాధపడుతున్నారని తేలింది. దీని వల్ల శరీరంలో కొలాజెన్ అనే ప్రోటీన్ ఉత్పత్తి ఎక్కువై, జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఇతర సమస్యలకు కూడా ఇది కారణమవ్వచ్చు. 

అంతేకాకుండా.. పగలు ఎక్కువగా నిద్రపోతున్నారట. దాంతో వారు దాదాపు రెండు రెట్లు ఒత్తిడిని అనుభవిస్తున్నారట. అలాగే మహిళల్లో కూడా నిద్రలేమి సమస్య, ఈడీఎస్ ఉందని రీసెర్చర్లు అంటున్నారు. ఇక 16 - 25 ఏళ్ల వయసు ఉన్న 1150 మంది డిగ్రీ, పీజీ స్టూడెంట్లతో ఈ సర్వే చేశారు. ఈడీఎస్, మెంటల్ హెల్త్, బాడీ మాస్ ఇండెక్స్ గురించి తెలుసుకున్నారు. 

నిద్ర లేకపోవడం వల్లే స్టూడెంట్ల ఏకాగ్రత తగ్గుతుందని, కాలేజీకి వెళ్లలేక పోతున్నారని ఈ రీసెర్చ్ లో పాల్గొన్న ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ మాటో గ్రాసో లెక్చరర్ ఒకరు చెప్పారు.

Also Read :- జుట్టుకు ఆముదం మంచిదేనా.. ఎలా ఉపయోగించాలి