టీచర్ల సమస్యల పరిష్కారానికి పోరాడుతా : అలుగుబెల్లి నర్సిరెడ్డి

నకిరేకల్, శాలిగౌరారం, వెలుగు : ప్రభుత్వ విద్యారంగం బలోపేతం, టీచర్ల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం పోరాటం చేస్తున్న తనకు మరో అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నకిరేకల్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌‌, డిగ్రీ కళాశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఉపాధ్యాయులతో సమావేశమై ఓటు నమోదు చేసుకొని మొదటి(1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం శాలిగౌరారం మండలం వల్లాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌‌ జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, మండల  అధ్యక్షుడు టి.నర్సింహమూర్తి, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.