స్ట్రీమ్ ఎంగేజ్..భారీ దొంగతనం

భారీ దొంగతనం

టైటిల్​     :  బెర్లిన్​
డైరెక్షన్​​     :  ​ఆల్బర్ట్​ పినా
కాస్ట్​  ​    :  పెడ్రో అలోన్సో, ట్రిస్టన్​ ఉల్లో, మిషెల్లి జెన్నర్​, బెగోనా వర్గాస్​, జులియో పెనా ఫెర్నాండెజ్​, జోయెల్ శాంచెజ్​, మారియా ఇసాబెల్​ రోడ్రిగెజ్​
లాంగ్వేజి     :  స్పానిష్​​
ప్లాట్​ ఫాం     :  ​నెట్​ఫ్లిక్స్​

స్పానిష్​ సిరీస్​ ‘మనీ హైస్ట్’​ నెట్​ఫ్లిక్స్​లోకి డబ్​ అయ్యి  ఇన్​స్టంట్​ హిట్​ కొట్టింది. గ్రిప్పింగ్​ స్క్రీన్​ప్లే, డైవర్స్​ క్యారెక్టర్స్​ ప్రేక్షకుల్ని కదలకుండా కూర్చోపెట్టాయి. ఇంచుమించు అలాంటిదే ‘బెర్లిన్’ సిరీస్. ఇందులో బెర్లిన్​ క్యారెక్టర్​ చుట్టూ కథ తిరుగుతుంది. బెర్లిన్​ కూడా మనీ హైస్ట్​  టెంప్లెట్​లోనే నడుస్తుంటుంది. కాకపోతే నెమ్మదిగా సాగుతుంది.  ఇందులో ప్రేమకథలు కూడా ఉన్నాయి. ​
బెర్లిన్​ మూడో భార్య అతడ్ని వదిలి వెళ్లిపోవడంతో సిరీస్​ మొదలవుతుంది. 

ఆ తరువాత బెర్లిన్​ తన గ్యాంగ్​తో చేరతాడు. అంతకుముందు కొంతకాలంగా చేయాలనుకున్న దొంగతనాన్ని ప్లాన్​ చేసేందుకు  రెడీ అవుతారు వాళ్లంతా. ఆ గ్యాంగ్​లో ఒక్కొక్కరు ఒక్కో విషయంలో నిష్ణాతులు. కైలా(మిషెల్లె జెన్నర్) ఎలక్ట్రానిక్​ ఎక్స్​పర్ట్​​, రోయి(జులియో పెనా) లాక్​ స్పెషలిస్ట్​, బ్రూస్​ (జోయెఓల్​ శాంచెజ్​) జాక్​ ఆఫ్​ ఆల్​ ట్రేడ్స్ అన్నట్టు​, డామియన్​ (ట్రిస్టాన్​ ఉల్లోవా) తెలివైన కాలేజీ ప్రొఫెసర్. ఈ టీంలో కామెరాన్​ (బెగోనా వర్గాస్​) తరువాత వచ్చి చేరుతుంది. ఈమెకు బాధాకరమైన గతం ఉంటుంది. 
 

ఈ గ్యాంగ్​ అంతా కలిసి పోలీస్​ ఆఫీసర్లలా ఒక ఇంటిమీద రైడ్​ చేయాలనుకుంటారు. అది సక్సెస్ ఫుల్​గా జరిగాక.. అందరూ పారిస్​ హోటల్​లో కలుసుకుంటారు. అక్కడ బెర్లిన్​, డామియాన్​లు కలిసి పెద్ద స్కీం గురించి చెప్తారు. ఆ గ్రాండ్ ప్లాన్​ ఏంటంటే... 44 మిలియన్ల యూరోల విలువ చేసే నగలను పలు యూరోపియన్​ సిటీల నుంచి దొంగిలించడం. ఆ దొంగతనం అంతా ఒక రాత్రిలో జరిగిపోవాలి​. మరి అందులో సక్సెస్​ అయ్యారా? లేదా? అనేది సిరీస్​ చూసి తెలుసుకోవాలి. 
 

బెర్లిన్​  షో ఎనిమిది ఎపిసోడ్స్​ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్​ నిడివి ఒక గంట. మనీ హైస్ట్​ సిరీస్​తో పోల్చకుండా చూస్తే ఎంజాయ్​ చేయొచ్చు. కావాల్సినంత డ్రామా, రొమాన్స్​ ఉన్నాయి. హైస్ట్​ ​ జానర్​లో కొత్తదనాన్ని చూపించలేకపోయినా క్యారెక్టర్స్​,​ లొకేషన్స్​ బాగున్నాయి. పెడ్రో అలోన్సో మళ్లీ ఒకసారి నటనతో తన మీదకి దృష్టి మరల్చుకున్నాడు.