సునీతా విలియమ్స్ చిక్కుకున్న స్పేస్‌క్రాఫ్ట్ నుంచి వింత శబ్దాలు

భారత సంతతికి చెందిన అమెరికా ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్షం కేంద్రంలో చిక్కుకుపోయారు. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో ఆమెతోపాటు నాసా ఆస్ట్రానాట్ బుచ్ విల్మోర్ కూడా ఉండిపోయారు. వారు ఉన్న స్పేస్‌క్రాఫ్ట్ నుంచి వింత శబ్ధాలు వినిపిస్తున్నాయని బుచ్ విల్మోర్ హ్యూస్టన్‌లోని నాసా మిషన్ కంట్రోల్‌కు తెలిపారు. ఈ మేరకు వారు రికార్డ్ చేసిన ఓ ఆడియో ఫైల్ పంపించారు. స్పేస్ క్రాఫ్ట్ లోపలి నుంచి వచ్చే శబ్ధం జలాంతర్గామి సోనార్‌ను పోలి ఉందని బుచ్ విల్మోర్ చెప్పారు. 

ALSO READ : సునీతను తీసుకొచ్చేందుకు మరో స్పేస్​​క్రాఫ్ట్

2024 జూన్ 5న కేవలం 10 రోజుల మిషన్‌లో భాగంగా సునీత, విల్‌మోర్‌ ఈ రోదసీ యాత్ర చేపట్టారు. జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సి ఉండగా.. స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. దీంతో భూమిపై ల్యాండింగ్‌ను వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్‌ 26న వీరు తిరుగు ప్రయాణం కానున్నట్లు నాసా ప్రకటించగా.. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. అప్పటి నుంచి పలు మార్లు వీరి తిరుగు ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 6న వీరు తిరిగి భూమి మీదకు రావాల్సిఉంది.