కేరళలో వింతఘటన..గట్టిపడిన జాతీయ జెండా ముడి విప్పిన పక్షి

ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ప్రజలు స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు..వాడవాడల జాతీయ జెండా రెపరెపలాడింది. ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజున సంబురాలు జరుపుకున్నారు. అయితే కేరళలో  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగుర వేస్తుండగా..ఓ విచిత్ర ఘటన జరిగింది. 

జాతీయ జెండా ఎగుర వేస్తున్నప్పుడు ముడి గట్టిపడి జెండా విచ్చుకోలేదు.. అదే సమయంలో పక్షిని వ్యవహరించిన తీసుకు అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. ఈ ఘటన కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.. 

కేరళలోని ఓ స్కూల్ ఆగస్టు15,2024న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  జాతీయ జెండా ఎగురవేస్తుండగా.. ముడి గట్టిపడి జెండా విచ్చుకోలేదు.. ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్న నిర్వాహకులు ప్రయత్నించినప్పటికీ అది జరగలేదు.. ఇంతలో ఓ పక్షి ఎక్కడినుంచి వచ్చిందే తెలియదు గానీ.. రయ్యిన ఫ్లాగ్ జెండా వైపు దూసుకు వచ్చిం ది.. గట్టిపడిన ముడిని విప్పి తిరిగి వెంటనే వెళ్లిపోయింది.. జరిగిన వింతను చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..ఈ విచిత్ర ఘటనను చూసిన నెటిజన్లు  ఆశ్చర్యంవ్యక్తం చేస్తున్నారు. కొందరైతే అనుకోకుండా అలా జరిగింది..ఇందులో వింతేముంది అని అంటున్నప్పటికీ పక్షి చేసింది మాత్రం అక్కడ జెండా హోస్టింగ్ చేస్తున్న స్కూల్ నిర్వాహకులు మాత్రం తమ పక్షి తమ సమస్యను తీర్చడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.