పులి అంటే పులి కాదు : చొప్పదండి మార్కెట్ లో కనిపించిన వింత జంతువు ఏంటీ..?


అది పులా లేక పులి పిల్లనా అంటే పులి కాదు అని మాత్రం గట్టిగా చెబుతున్నారు.. అయితే పులి కాకపోతే ఇంకేంటీ.. ఏంటీ వింత జంతువు.. ఏమై ఉంటుంది.. ఈ వింత జంతువు ప్రమాదకారా లేక సాధు జంతువా.. ఎక్కడి నుంచి వచ్చింది.. ఎటు వెళ్లింది.. ఎక్కడ దాక్కుంది.. ఇప్పుడు ఏం చేస్తుంది.. మళ్లీ వస్తే పరిస్థితి ఏంటీ.. సీసీ కెమెరాల్లో కనిపించిన వింత జంతువు మనుషులపై దాడి చేస్తుందా లేక మనుషులను చూసి భయపడి పారిపోతుందా.. ఇలాంటి ఎన్నో సందేహాలు.. అనుమానాలు.. ఆందోళనలు ఉన్నాయి.. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది.. ఎప్పుడు జరిగింది అనేది పూర్తిగా తెలుసుకుందాం...

కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో వింత జంతువు సంచారం కలకలం రేపింది. అచ్చం చిరుతపులిలాగా సీసీ కెమెరాల్లో కనిపించడంతో వింత జంతువు వచ్చినట్లు పుకార్లు వచ్చాయి.  వ్యవసాయ మార్కెట్ కు చిరుత పులి వచ్చిందంటూ ప్రచారం జరగడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో అధికారులు సీసీఫుటేజీని పరిశీలించారు.  అయితే, అది చూడటానికి చిన్నగా ఉండటంతో పులి పిల్లనా లేక పిల్లి అనేది తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు.  అది ఏ రకం జంతువు అని నిర్ధారించడంలో అధికారులు నిమగ్నమయ్యారు.