మూలికలతో మొదలైన హిమాలయ.. ఇప్పుడు ఇండియాలోనే పెద్ద మార్కెట్

‘హిమాలయ’ అనే పేరు వినగానే హిమాలయాల కంటే ముందు హిమాలయ వెల్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ గుర్తుకొస్తాయి ఎక్కువమందికి. ముఖ్యంగా చిన్న పిల్లల ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ విషయంలో జనాల నమ్మకాన్ని దక్కించుకుంది. అందుకే ఇప్పుడు ఇండియాలో ఎక్కువమంది హిమాలయ ప్రొడక్ట్స్​ వాడుతున్నారు. మొదట ఈ కంపెనీ ఒక హెర్బల్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌తో మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చింది.

ఇండియాకి స్వాతంత్ర్యం రాకముందే హిమాలయ డ్రగ్ కంపెనీ కథ మొదలైంది.1930లో ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని డెహ్రాడూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ‘ఇనాముల్లా’ అనే ఒక బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జర్నీ స్టార్ట్​ చేసింది. బ్రిటిష్ వాళ్లతో సహా యావత్ ప్రపంచానికి భారతీయ ఆయుర్వేద శక్తిని చాటిచెప్పిన సంస్థ. ఆయుర్వేదం అంతరించిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక యంగ్ ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ కంపెనీ మొదలుపెట్టాడు. ఆయన పేరే మొహమ్మద్ మనాల్. 

మనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి అడవులంటే చాలా ఇష్టం. అందుకే అప్పుడప్పుడు అడవుల్లోకి వెళ్లి ప్రకృతి అందాలను చూస్తూ ఎంజాయ్​ చేసేవాడు. కొత్త ప్రదేశాలను ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లోర్ చేసేవాడు. అలా ఒకసారి బర్మా అడవులకు వెళ్లాడు మనాల్. అక్కడ అతనికి ఎదురైన ఒక అనుభవం హిమాలయ కంపెనీ పెట్టడానికి కారణమైంది. ఈ రోజు ఇంత పెద్ద నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పరచుకోవడానికి బాటలు వేసింది. 

ఏనుగుల గుంపుని.. 

చిన్నప్పటినుంచి మనాల్​కు ఆయుర్వేదం మీద పూర్తి నమ్మకం ఉండేది. ఆయుర్వేదం వాడితే ఎలాంటి హాని ఉండదని నమ్మేవాడు. అలాంటి టైంలో ఆయుర్వేదం పనితీరుని బర్మా అడవుల్లో స్వయంగా చూశాడు. ఆ అడవుల్లో చిన్న ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల మీద అప్పుడప్పుడు ఏనుగుల గుంపులు దాడి చేసేవి. అప్పుడు ఆ గ్రామాల ప్రజలు ఆయుర్వేద మూలికలను వాటికి తినిపించి చంచలమైన ఏనుగులను శాంతింపజేసి పంపించేవాళ్లు. ఇదంతా చూసిన మనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయుర్వేద పద్ధతులతో ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని సవాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే మనాల్ దేన్నీ గుడ్డిగా నమ్మేవాడు కాదు. అందుకే ఆ మూలిక మీద మరింత రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తేవాలి అనుకున్నాడు. వెంటనే ఆ మూలిక సైంటిఫిక్​ లక్షణాలను తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తను చేస్తున్న రీసెర్చ్ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయితే.. హిమాలయ డ్రగ్ కంపెనీ పెట్టాలనే ఆలోచన కూడా అప్పుడే వచ్చింది. 

డెహ్రాడూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

మనాల్ ఇండియాకి వచ్చాక డెహ్రాడూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చుట్టుపక్కల ఆ మూలిక ఉండడంతో అక్కడే రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టాడు. కానీ.. ఆ మూలికను టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు కావాల్సినంత డబ్బు ఆయన దగ్గర లేదు. కనీసం ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసేందుకు కూడా డబ్బు సరిపోలేదు. అందుకే ఒక ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అద్దెకు తీసుకున్నాడు. దాని రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలకు రెండు రూపాయలు. అదే ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మనాల్ ‘రౌవోల్ఫియా సెర్పెంటినా’ మొక్క నుంచి డ్రగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. దాన్ని1934లో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తెచ్చాడు. దానికి ‘సెర్పినా’ అని పేరు పెట్టాడు. ఇది  ప్రపంచంలోని మొట్టమొదటి నేచురల్ యాంటీహైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెన్సివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రగ్. 

ఈ డ్రగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినా పోటీ మార్కెట్​లో ఈ ఆయుర్వేద మందు అమ్మడం మనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పెద్ద టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యింది. అదీకాక.. మనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తన కలను సులభంగా సాకారం చేసుకునేంత ఆర్థిక బలం లేదు.  అయినప్పటికీ తన కలను ఎలాగైనా నెరవేర్చుకోవాలి అనే పట్టుదలతో ముందడుగు వేశాడు. 

టాబ్లెట్ మెషిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

మనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టాలంటే..  ముందుగా ట్యాబ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారుచేసే మెషిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనాలి. కానీ.. దానికి కూడా అతని దగ్గర డబ్బు లేదు. దాంతో తప్పని పరిస్థితుల్లో తన కుటుంబ ఆస్తులు, తల్లి నగలు తనఖా పెట్టి ట్యాబ్లెట్ మెషిన్ కొన్నాడు. ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టాక ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైద్యం ఆధిపత్యాన్ని తిప్పికొట్టేందుకు రాత్రింబవళ్లు కష్టపడి పని చేశాడు. మొదట్లో లాభాలు అంతగా రాలేదు. అయినా.. ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిటీలో రాజీపడలేదు. ఆయుర్వేదం గురించి తెలిసిన పెద్దలను కలిసి వనమూలికల గురించి అడిగి తెలుసుకుని వాటి గురించిన అవగాహన పెంచుకున్నాడు.

సంక్షోభం వచ్చిపడింది 

మనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనాలు వాడడం మొదలైందో లేదో స్వాతంత్ర్యం ప్రకటన వచ్చింది. వెంటనే దేశ విభజన రూపంలో కొత్త సంక్షోభం వచ్చిపడింది. హిందూ, ముస్లిం ప్రాతిపదికన విడిపోతున్న దేశాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి. మనాల్ చివరికి తను పుట్టిన, బాల్యాన్ని గడిపిన మట్టినే ఎంచుకున్నాడు. అలా ఇండియాలో ఉండేందుకే డిసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. అప్పుడే తను తయారుచేసిన  ఆయుర్వేద ఔషధాల ప్రభావం గురించి ముస్లిం నాయకులు కూడా తెలుసుకున్నారు. మొహమ్మద్ మనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రావాలని ఒప్పించేందుకు ట్రై చేశారు. కానీ.. మనాల్ అందుకు ఒప్పుకోలేదు. 

లివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..తో సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కంపెనీని మరింత డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముంబయిలో మరో ప్లాంట్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత1955వ సంవత్సరంలో హిమాలయ నుంచి పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లివర్ ఫార్ములాతో ‘లివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–52’ అనే ట్యాబ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని విడుదల చేశారు. ఇది లివర్ సరిగ్గా పనిచేయడంలో సాయపడుతుంది. దీని పనితనం బాగుండడంతో తక్కువ టైంలోనే బాగా పాపులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యింది. దీన్ని ఇప్పటికీ చాలామంది వాడుతున్నారు. ఈ ట్యాబ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే కంపెనీకి సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. ఆ తర్వాత మరికొన్ని ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది. ఇవి కూడా సక్సెస్ కావడంతో ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పెంచాల్సి వచ్చింది. మొదట్లో ఒక హ్యాండ్–క్రాంక్డ్ మెషిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ట్యాబ్లెట్స్​ తయారు చేసేవాళ్లు. ఇప్పుడు లేటెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీతో ప్రతిరోజూ10 మిలియన్లకు పైగా ట్యాబ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తయారుచేస్తున్నారు. ఆయుర్వేద మందులు ఇచ్చిన సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హిమాలయ తన పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోలియోను మెడిసిన్స్ నుండి సెల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కంఫర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యానిమల్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విస్తరించింది. అంతెందుకు తల నుండి మడిమ వరకు అనేక సమస్యలకు హెర్బల్ మందులు అమ్ముతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ సరిపోయే ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తీసుకొచ్చింది. 

బెంగళూరుకి...

మనాల్ తర్వాత అతని కొడుకు మేరాజ్ మనాల్ సంస్థను నడిపించాడు. డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సరిపడా సప్లయ్​ని పెంచేందుకు బెంగళూరులో ఒక ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత హిమాలయ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని విదేశాలకు ఎగుమతి చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇండియాతోపాటు ప్రపంచంలోని105కి పైగా దేశాల్లో ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమ్ముతున్నారు. ముఖ్యంగా ఆసియా, యూరప్, అమెరికా, ఆఫ్రికాల్లో ఎక్కువ బిజినెస్ జరుగుతోంది. అంతేకాదు.. ప్రపంచంలోని మూడు లక్షల కంటే ఎక్కువ మంది డాక్టర్లు హిమాలయ మందులు వాడాలని వాళ్ల దగ్గరకు వచ్చిన పేషెంట్లకు సూచిస్తున్నారు. 

గ్లోబల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో... 

ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి మొదటి అడుగు1996లో వేసింది కంపెనీ. డైటరీ సప్లిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని యునైటెడ్ స్టేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మింది. అక్కడ ప్రజాదరణ పొందడంతో ఇతర దేశాలకు విస్తరించింది. 2015 నాటికి అంటే19 ఏండ్లలో కంపెనీ 91 దేశాలకు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ కంపెనీకి ఇండియా, విదేశాల నుంచి వచ్చే ఆదాయం సమంగా ఉంది. 

ఎన్ని వచ్చినా.. 

హిమాలయ నుంచి ఎన్ని ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చినా ‘లివ్–52,  నీమ్ ఫేస్ వాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లకు రోజురోజుకూ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుగుతూనే ఉంది. 2016 నుండి కంపెనీ గర్భిణుల కోసం కొన్ని ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమ్ముతోంది. వీటివల్ల తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండడంతో ఇది కూడా చాలా తక్కువ టైంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. 

జంతువుల మీద టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు... 

సాధారణంగా కాస్మొటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మందులను ముందుగా జంతువుల మీద టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుంటారు. కానీ.. హిమాలయ కంపెనీలో తయారయ్యే ఏ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  జంతువుల మీద టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంలేదు. చిన్న ప్రాణికి కూడా హాని కలగకూడదనే ఉద్దేశంతో టెక్నాలజీ, సైన్స్ సాయంతో ఈ కంపెనీ మందులను పరీక్షిస్తున్నారు.  

సేంద్రియ పద్ధతిలో ...

హిమాలయ కంపెనీ  ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాడే దాదాపు అన్ని మూలికలను పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని నిషేధం. కీటకాలు, తెగుళ్ళ దాడుల నుండి పంటలను కాపాడుకోవడానికి వేప నూనె లాంటి నేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడుతున్నారు. అంతేకాదు.. ఈ పంటలు పండించే రైతులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్యావరణ అనుకూల మార్గాలు, మొక్కలు, పువ్వులను ఎలా కాపాడుకోవాలి? అనేవి నేర్పిస్తారు.

హిమాలయ మైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

1930 – డెహ్రాడూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలైంది.
1934– మొదటి ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెర్పినా లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.
1943 – కిడ్నీలో రాళ్లను తగ్గించే సిస్టోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చింది. 
1952 – కంపెనీకి సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన లివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–52 లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.
1960– అంధేరిలో ఫ్యాక్టరీ ఏర్పాటు, ఇమ్యూనిటీ బూస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెప్టిలిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. 
1975– బెంగళూరులో మరో యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు.
1991– బెంగళూరులో రీసెర్చి అండ్​ డెవలప్​మెంట్​ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు.
1996– అమెరికాలో మొదటి ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీవుల్లో మొదటి దుకాణం ఏర్పాటు. 
1998– యానిమల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.
1999– పర్సనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.
2000– దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆఫీస్ ఏర్పాటు.
2001– నీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
2004– పిల్లల కోసం ప్రత్యేకంగా బేబీ హెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వైప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటివి లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.
2009– ఓరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేర్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బొటానిక్ లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.
2022 – దుబాయిలో రీసెర్చి అండ్​ డెవలప్​మెంట్​ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు.
2023– దుబాయిలో మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనిట్ ఏర్పాటు.