ఏంటీ.. చెప్పులు రూ. 23కోట్లా.. !! అంత స్పెషల్ ఏముందో..

చెప్పుల ఖరీదు ఎంతుంటుంది.. రూ.1 వెయ్యి, రూ.2 వేలు.. మహా అయితే రూ. 1 లక్ష ఉంటుంది.. అనుకుందాం. కానీ..23 కోట్ల చెప్పులు ఎప్పుడైనా చూశారా.. అవును అంత విలువ చేసే చెప్పులు ఉన్నాయి.  అమెరికాకు చెందిన నటి, సింగర్ జూడి గర్లాండ్‌ ది విజార్డ్ ఆఫ్ ఓజ్‌ సినిమాలో  ధరించిన రుబీ చెప్పులను ఇటీవల వేలం వేయగా.. అవి ఏకంగా 28 మిలియన్ డాలర్లు (సుమారు రూ.23 కోట్లు పైనే ) పలికాయి. దాదాపు 20 ఏళ్ల కిందట చోరీకి గురైన ఈ చెప్పులు తాజా వేలంలో అంత ధర పలకడం హాట్ టాపిక్ గా మారింది.

Also Read:-యూఎస్​ కంపెనీలో సువెన్ ఫార్మాకు వాటా..

2005లో చోరీకి గురైన ఈ చెప్పులను ఎఫ్‌బీఐ అధికారులు సుదీర్ఘ కాలం దర్యాప్తు చేసి 2018లో స్వాధీనం చేసుక్కున్నారు. అనంతరం   మిన్నెసోటాలోని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఇటీవల వీటిని వేలం వేయగా.. ఏకంగా 28 మిలియన్ డాలర్ల రికార్డ్ ధర పలికాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఈ చెప్పుల్లో అంత స్పెషాలిటీ ఏముందో అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.