యునిసెఫ్‌‌ ప్రతినిధుల సదస్సు

కరీంనగర్  టౌన్, వెలుగు: కరీంనగర్‌‌ ‌‌  జిల్లాలో సుస్థిర పారిశుధ్య నిర్వహణకు యునిసెఫ్ సహకారం అందిస్తుందని రాష్ట్ర వాష్ స్పెషలిస్ట్ వెంకటేశ్ అన్నారు. గురువారం సిటీలోని  ఓ హోటల్‌‌ లో తెలంగాణ, ఏపీ, కర్నాటక రాష్ట్రాల యునిసెఫ్ ప్రతినిధుల సదస్సు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ దేశాల్లో పిల్లలు, మహిళలు ఆరోగ్యంగా ఎదిగేందుకు యూనిసెఫ్ సహకారం అందిస్తోందన్నారు. ముఖ్యంగా పేద, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లో సేవలకు ప్రాధాన్యమిస్తోందన్నారు. కార్యక్రమంలో యునిసెఫ్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కిషన్ స్వామి, వివిధ రాష్ట్రాల కన్సల్టెంట్లు ప్రభాత్, కాశీనాథ్, నర్సింహారెడ్డి, జిల్లా స్వచ్ఛభారత్ సమన్వయకర్తలు రమేశ్‌‌ , వేణు పాల్గొన్నారు.