2047 వరకు దేశంలో బీజేపీదే అధికారం : మనోహర్ రెడ్డి

చౌటుప్పల్, వెలుగు : 2047 వరకు దేశంలో బీజేపీ అధికారంలో ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి జ్యోసం చెప్పారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని 29వ బూత్ లో​ ఇంటింటికీ తిరిగి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు  దేశవ్యాప్తంగా 4 కోట్ల 20 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని, లక్ష్యం పూర్తయ్యే వరకు ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

2014లో మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రపంచంలో 11వ స్థానం నుంచి ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్నామని, రాబోయే కాలంలో 3 స్థానంతో ఉంటామని చెప్పారు.  ప్రధాని మోదీ వికసిత భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సమీక్షలతోనే పబ్బం గడుపుతున్నదని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు.