చెక్కుల పంపిణీ : పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ  సలహాదారుడు, బాన్​వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు మంగళవారం చెక్కులను పంపిణీ చేశారు. శాంతినగర్, సంగమేశ్వర్ కాలనీ వాసులకు ప్రభుత్వం రూ.27 లక్షలను చెక్కుల రూపంలో మంజూరు చేసింది. 

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసలైన లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం నుంచి వచ్చే చెక్కులను అందించడానికి ప్రయత్నిస్తానని అన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగాధర్, పంచాయతీరాజ్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు  పాల్గొన్నారు.