ఉన్నత శిఖరాలకు చేరాలంటే కష్టపడి చదవాలి : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌

  • మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ 

కరీంనగర్‌‌‌‌(చిగురుమామిడి), వెలుగు: ఉన్నత శిఖరాలకు చేరాలంటే విద్యార్థులు కష్టపడి చదవాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖా మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌గౌడ్‌‌ సూచించారు. శనివారం కరీంనగర్‌‌‌‌ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నమల్కనూరు మోడల్‌‌ స్కూల్‌‌, జూనియర్‌‌‌‌ కాలేజీలో విద్యార్థులకు కలెక్టర్‌‌‌‌ పమేలా సత్పతి కలిసి షూస్‌‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో స్కూళ్ల అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్‌‌ పెట్టిందన్నారు.

 అమ్మ ఆదర్శ పాఠశాలల ప్రోగ్రాం కింద రూ.1100కోట్లతో రాష్ట్రంలోని 25 వేల స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించామన్నారు. 11 ఏండ్ల తర్వాత 19 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ,35 వేల మందికి బదిలీలు చేపట్టామన్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న మోడల్‌‌స్కూళ్లు, గురుకులాలకు అద్దె చెల్లిస్తున్నామన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకునేదాకా వెనక్కి తగ్గొద్దన్నారు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.