అయోధ్యకు పాదుకలతో పాదయాత్ర

అయోధ్య రాముడికి పాదుకలు కానుకగా ఇవ్వాలనేది ఓ భక్తుడి కోరిక. ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడ నుంచి పాదుకలను తలపై మోస్తూ అయోధ్యకు పాదయాత్ర మొదలుపెట్టాడు. హైదరాబాద్​ కేంద్రంగా పనిచేస్తోన్న భాగ్యనగరం సీతారామ సేవా ట్రస్ట్​ ఫౌండేషన్ డైరెక్టర్​ చల్లా శ్రీనివాస శాస్త్రి. రాముడి కోసం వెండి పాదుకలు తయారుచేయించాడు. అవి ఒక్కోటి 8 కిలోల బరువు ఉన్నాయి. 

అవి పట్టుకుని పోయినేడాది అక్టోబర్​ 28న పాదయాత్ర ప్రారంభించాడు. వెండి పాదుకలకు బంగారం అద్దాలనే ఆలోచనతో కొన్నాళ్లు విరామం తీసుకున్నాడు. పాదుకలను హైదరాబాద్​కు పంపించి బంగారు పూత పూయించాడు. పూత వేశాక ఒక్కో పాదుక బరువు12.5 కిలోలకు చేరింది. వీటి విలువ1.2 కోట్లు ఉంటుంది!