సారంగపూర్ ఆలయానికి పాదయాత్ర ప్రారంభం

పిట్లం, వెలుగు:  వైశాఖ మాస హనుమాన్​ జయంతి సందర్భంగా పిట్లం పోతిరెడ్డిపల్లి హనుమాన్​ ఆలయం నుంచి సారంగపూర్ ​మహారుద్ర వీర హనుమాన్​ ఆలయానికి పాదయాత్ర ప్రారంభమైంది.  ఆదివారం ఉదయం పాదయాత్రను ఆలయ నిర్వాహకులు తేజ గురుస్వామి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వైశాఖ మాస హనుమాన్​ జయంతి కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల పాటు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఆదివారం మహశివునికి రుద్రాభిషేకం,  అన్నపూజ ఉంటుందని తెలిపారు. సాయంత్రం ఆలయ ఆవరణలో కుస్తీ పోటీలు ఉంటాయని తెలిపారు.