SSC నుంచి భారీ నోటిఫికేషన్ : డిగ్రీ పాసైన వారికి గుడ్‌న్యూస్

సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునే వాళ్లకు గుడ్ న్యూస్. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేసేందుకు కంబైన్డ్ గ్రాడ్యుయేట్‌ లెవల్ (CGL) 2024 నోటిఫికేషన్ ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని మొత్తం 17వేల 727 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.100 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ, మహిళలు,దివ్యాంగులు,ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మాత్రం ఫీజులో మినహాయింపు ఉంటుంది. 

రెండు స్టేజ్ లో  టైర్-1, టైర్-2 పరీక్షలు పెట్టి ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు జూన్‌ 24, 2024వ తేదీ నుంచి ప్రారంభమైంది. జులై 24, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.   ఉద్యోగాలకు ఎంపికైనవారికి పోస్టుల స్థాయినిబట్టి నెలకు రూ.25 వేల 500ల నుంచి రూ.లక్షా 51వేల 100 వరకు జీతం ఉంటుంది.