ఎస్సారెస్పీ గేట్లు క్లోజ్​

బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ప్రవాహం తగ్గింది.  దీంతో ప్రాజెక్టు గేట్లను సోమవారం సాయంత్రం క్లోజ్ చేశారు. ఆదివారం సాయంత్రానికి వరద ప్రవాహం తగ్గడంతో 24 గేట్ల నుంచి 20 గేట్లకు తగ్గించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 26,897 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు ఆఫీసర్లు తెలిపారు. అంతకు ముందు 93 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో రావడంతో 20 గేట్ల నుంచి 66636 క్యూసెక్కులు, తొమ్మిది గేట్లకు తగ్గించి 28 వేల క్యూసెక్కుల మిగులు జలాలను వదిలారు.

65 వేల క్యూసెక్కులకు తగ్గడంతో 5 గేట్ల నుంచి 15,620 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ఇన్​ఫ్లో 26 వేల క్యూసెక్కులకు తగ్గడంతో వరద గేట్లను మూసివేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు,80.50 టీఎంసీలు కాగా సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టులో1090.90 అడుగులు,80.05 టీఎంసీల నీరు ఉంది. కాకతీయ కాలువకు నాలుగు వేల క్యూసెక్కుల నీటి విడుదలవుతుండగా జల విద్యుత్ కేంద్రంలో 32 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేలు, వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ ద్వారా 18 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.