శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 22 గేట్లు ఓపెన్​

  • 1.09 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో
  •  గోదావరిలోకి 82 వేల క్యూసెక్కులు విడుదల

బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం రాత్రి వరకు ఇన్​ఫ్లో 1.09 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 22 వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి 82వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.  కాకతీయ కాలువకు 6800 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 

1200 క్యూసెక్కులు విడుదల  చేయడంతో  జల విద్యుత్ కేంద్రంలోని నాలుగు టర్భయిన్ల ద్వారా 36.40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని జెన్ కో డీఈ శ్రీనివాస్ తెలిపారు. వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ ద్వారా దిగువ ఎల్ఎండీకి 19 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.