కరీంనగర్‎కు చేరిన శ్రీరామ యంత్ర ప్రతిష్ట

శ్రీరామ యంత్ర ప్రతిష్ట రథయాత్ర బుధవారం కరీంనగర్‎కు చేరింది. మహాశక్తి ఆలయంలో ఉంచి శ్రీ యంత్రానికి అర్చకులు పూజలు నిర్వహించగా భక్తులు తరలివచ్చి తిలకించారు. గత నెల అక్టోబర్ 27న తిరుపతిలో రథయాత్ర ప్రారంభమవగా.. అయోధ్యకు తరలిస్తున్నారు. కంచి పీఠంలో ఉన్న శ్రీ రామ యంత్రం ఆధారంగా శ్రీ రాముడు, ఇతర దేవతల మంత్రాలతో శ్రీరామ యంత్రాన్ని చెక్కారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పర్యవేక్షణలో 180 కిలోల బంగారు తాపడంతో రూపొందించారు. అయోధ్యలో మహా యాగశాలలో ప్రతిష్టించి, 45 రోజుల వైదిక పూజల అనంతరం శ్రీ రామ జన్మభూమి ఆలయానికి సమర్పిస్తారు.