ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు,వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో శ్రీ రాంసాగర్ లోకి భారీగా వరద ఉదృతి కొనసాగుతోంది. 40 గేట్లు ఓపెన్ చేసి నీటిని కిందకు విడుదల చేశారు అధికారులు. అప్రమత్తంగా ఉండాలని పరిసర ప్రాంతాల ప్రజలకు సూచించారు. శ్రీరాంసాగర్ లో చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.
ALSO READ | తెలంగాణకు తప్పిన గండం : మరో 5 రోజులు మోస్తరు వర్షాలు మాత్రమే
శ్రీరాంసాగర్ ఇన్ ఫ్లో 2 లక్షల 4 వేల 17 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 2 లక్షల 15 వేల 853 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు.. 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1088.9 అడుగులు .. 72.990 టీఎంసీలుగా ఉంది.